మీడియా నివేదికల ప్రకారం, మహీంద్రా త్వరలో  థార్ ఎస్‌యూ‌విలో టూ వీల్ డ్రైవ్ ఆప్షన్ అందించవచ్చు. నివేదికల ప్రకారం, దీనిని వచ్చే ఏడాది ప్రవేశపెట్టవచ్చు. తాజాగా థార్ కొత్త టూ వీల్ డ్రైవ్‌తో కనిపించింది. 

భారతదేశపు అతిపెద్ద ఎస్‌యూ‌వి తయారీ సంస్థ మహీంద్రా థార్ ని త్వరలో అప్ డేట్ చేయబోతుంది. దీనిపై కంపెనీ ఇంకా అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే మీడియా నివేదికల ప్రకారం, థార్‌లో టూ వీల్ డ్రైవ్ ఆప్షన్ చూడవచ్చు. ఇంకా ధరలో కూడా మార్పు ఉంటుంది. ఈ టూ వీల్ డ్రైవ్ ఆప్షన్ గురించి పూర్తి సమాచారం తెలుసుకొండి..

లో రేంజ్ గేర్‌బాక్స్
మీడియా నివేదికల ప్రకారం, మహీంద్రా త్వరలో థార్ ఎస్‌యూ‌విలో టూ వీల్ డ్రైవ్ ఆప్షన్ అందించవచ్చు. నివేదికల ప్రకారం, దీనిని వచ్చే ఏడాది ప్రవేశపెట్టవచ్చు. తాజాగా థార్ కొత్త టూ వీల్ డ్రైవ్‌తో కనిపించింది. దీంతో త్వరలోనే కంపెనీ కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు.

ప్రస్తుత వెర్షన్‌లో 
మహీంద్రా అత్యుత్తమ ఎస్‌యూ‌విలలో ఒకటైన థార్ ప్రస్తుత వెర్షన్ గురించి మాట్లాడితే ఇది ఫోర్ వీల్ డ్రైవ్‌తో వస్తుంది. ఇంకా దీని రెండు వేరియంట్‌లు LX అండ్ AX ఆప్షనల్ గా కంపెనీ అందిస్తోంది.

ధర
థార్ ప్రస్తుత వేరియంట్ ధర గురించి మాట్లాడితే, LX వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 14.28 లక్షలు. దీని AX వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.59 లక్షలు. కంపెనీ టూ వీల్ డ్రైవ్ వేరియంట్‌ను కూడా తీసుకువస్తే, దాని ధర రెండు వేరియంట్‌ల కంటే తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

యువకులు ఎక్కువగా 
థార్ కొన్న వారిలో ఎక్కువ మంది యువత ఉన్నారు. ఆఫ్‌ రోడింగ్‌, ఫోర్‌ వీల్‌ డ్రైవ్‌ ఎస్‌యూవీలను యువత బాగా ఇష్టపడుతున్నారు. థార్ అనేక అవసరాలను తీరుస్తుంది. ప్రస్తుతం, థార్‌ను బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ కోసం ఒకటి నుండి మూడు నెలల వరకు వేచి ఉండాలి. నగరం ఇంకా వేరియంట్ ప్రకారం డెలివరీ టైం మారవచ్చు.