మహీంద్రా కంపెనీ మినీ-ట్రక్ జీటో  కొత్త అధునాతన వేరియంట్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ కొత్త వేరియంట్‌ మహీంద్రా జీటో ప్లస్‌ ఇది 1 టన్ను సామర్ధ్యం గల తేలికపాటి బిజినెస్ వాహనం, దీని  ధర 3.47 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై).

సాధారణ జీటో మినీ-ట్రక్‌తో పోలిస్తే, మహీంద్రా జీటో ప్లస్ వేరియంట్ మొత్తం 7.4ft అడుగుల పొడవుతో 715 కిలోల పేలోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మహీంద్రా జీటో ప్లస్ 3 సంవత్సరాల లేదా 72,000 కిలోమీటర్ల క్లాస్ వారంటీతో వస్తుంది.

also read  లెక్సస్ కంపెనీ ఎలక్ట్రిక్ కారు..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే చాలు...

మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్, స్మాల్ కమర్షియల్ వెహికల్స్ బిజినెస్ హెడ్ సతీందర్ సింగ్ బజ్వా కొత్త మహీంద్రా జీటో ప్లస్ గురించి మాట్లాడుతూ“జీటో ప్లస్ ప్రారంభించడంతో, మహీంద్రా తన వినియోగదారులకు ఒక అద్భుతమైన విలువను అందిస్తుంది. బాడి గాడి, బాడి కామై, బాడి కామోయాబి యొక్క బ్రాండ్ వాగ్దానానికి అనుగుణంగా, జీటో ప్లస్ వినియోగదారులకు మరింత లాభదాయకంగా సంపాదించడానికి వీలు కల్పిస్తుంది.

also read ఎలక్ట్రిక్ కార్ల తయారీలో టెస్ల...కారు సంచలనం

ఈ మినీ-ట్రక్కుకి స్టైలిష్ లుక్స్, కారు లాంటి సౌకర్యం మరియు కొత్త భద్రత లక్షణాలు ఉన్నాయి. జీటో మినీ-ట్రక్ మంచి ప్రజాదరణను పెంచింది. జీటో ప్లస్ లో మా ఉత్పత్తుల లాగే దిని ఫీచర్స్ , ఇంకా పోటీ ధరలతో చూస్తే భారత మార్కెట్లో తనదైన ముద్ర వేస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాము " అని అన్నారు.

మహీంద్రా జీటో ప్లస్‌ మినీ ట్రక్ 625సి‌సి సింగల్ సిలిండర్, ఇంజన్ 3600 ఆర్పిఎమ్ వద్ద 16 bhpని ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. 1200-2200 ఆర్పిఎమ్ వద్ద 38nm పీక్ టార్క్ అభివృద్ధి చేస్తుంది, అయితే 4-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ దీనికి జతచేయబడింది.