Mahindra Atom: కేవలం రూ.3 లక్షలకే మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారు తెచ్చిన మహీంద్రా...పెట్రోల్, డీజిల్ చింతలేదు..

Mahindra Atom: మహీంద్రా నుంచి ఆటం పేరుతో సరికొత్త కారు విడుదలకు సిద్ధం కానుంది. ప్యాసింజర్ వెహికిల్ గా ముందుకు వచ్చిన ఈ కారు ద్వారా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గ్యాస్ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా ఉంటోంది. 

Mahindra Introduced New Range Of Electric Vehicles At Alternate Fuel Conclave 2022

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా దేశంలోని దిగ్గజ ఆటో కంపెనీలు అయిన, టాటా మోటార్స్, మహీంద్రా లాంటి కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతుండటంతో  ప్రస్తుతం కంపెనీలతో పాటు కస్టమర్లు ఈ వాహనాలపై ఆసక్తి చూపడం ప్రారంభించారు. పెద్ద వాహనాల తయారీ సంస్థలతో పాటు, చిన్న స్టార్టప్‌లు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్‌లోకి తీసుకువస్తున్నాయి. 

అయితే దేశీయంగా కమర్షియల్, పాసింజర్ వాహనాల సెగ్మెంట్ లో తనదైన ముద్ర వేసుకుంటున్న మహీంద్రా & మహీంద్రా  దాని ఎలక్ట్రిక్ ఆర్మ్ మహీంద్రా ఆటోమోటివ్ పూణేలో జరుగుతున్న ఆల్టర్నేట్ ఫ్యూయల్ కాన్క్లేవ్ 2022లో కొత్త శ్రేణి ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేసింది. మహీంద్రా ఎలక్ట్రిక్ ట్రియో ఆటో, ట్రియో జోర్ డెలివరీ వ్యాన్, ట్రియో టిప్పర్ వేరియంట్, ఇ-ఆల్ఫా మినీ టిప్పర్‌తో పాటు ఆటమ్ క్వాడ్రిసైకిల్‌ను పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ 3-వీలర్ విభాగంలో మహీంద్రా 73.4 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉందన్న సంగతి తెలిసిందే, దీని కారణంగా కంపెనీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది.

మహీంద్రా ఆటమ్ క్వాడ్రిసైకిల్
ఎలక్ట్రిక్ పవర్డ్ మహీంద్రా ఆటమ్ సౌకర్యవంతమైన, స్మార్ట్ ఫీచర్లతో క్లీన్ ఎనర్జీని కలిగి ఉంది. ఆటమ్‌తో పాటు, మహీంద్రా ఈ-ఆల్ఫా మినీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన ఎలక్ట్రిక్ ఆల్ఫా టిప్పర్‌ను కూడా మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఇ-ఆల్ఫా మినీ టిప్పర్ 1.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో శక్తిని పొందుతుంది, ఇది ఒక్కసారి ఛార్జింగ్‌పై 80 కిమీల పరిధిని అందిస్తుంది. దీని లోడింగ్ కెపాసిటీ 310 కిలోలు. ప్రస్తుతం, మహీంద్రా ఆటమ్ వాణిజ్య వాహనంగా విడుదల చేశారు, ఇది వ్యక్తిగత ఉపయోగం కోసం విడుదల చేయబడుతుందా లేదా అనేది ఇంకా తెలియదు.

దీని ఖరీదు 3 లక్షలు మాత్రమే...
మహీంద్రా ఆటమ్ లుక్స్,  ఫీచర్ల పరంగా చూస్తే మీ డబ్బుకు సరైన విలువైన కారు మాత్రమే కాదు, దీని ధర కూడా చాలా తక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది. ఇకపై ఊహాగానాలు చేయడం సరైంది కాదు, అయితే ఈ కారు ధర దాదాపు రూ.3 లక్షల వరకు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మహీంద్రా ఆటమ్ గరిష్టంగా గంటకు 50 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది మరియు దీనిని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఆటమ్ ఎలక్ట్రిక్ క్వాడ్రిసైకిల్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 120 కి.మీ వరకు నడపవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారును ముఖ్యంగా ప్యాసింజర్ వెహికిల్ గా వాడవచ్చు. పట్టణాల్లో ఆటోరిక్షాలకు ఈ ఎలక్ట్రిక్ వాహనం పోటీ ఇవ్వనుంది.   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios