అభిమానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్ర.. మిస్టర్ కూల్ అంటూ ఫాలోవర్లు ట్వీట్..

 ఎప్పుడు వింతైన, అరుదైన ఫోటోలను షేర్ చేసే ఆనంద్ మహీంద్రా తన సొంత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం చాలా అరుదు. తాజాగా ఆదివారం ఆనంద్ మహీంద్రా తన అరుదైన సెల్ఫీ ఫోటోని పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో సన్ గ్లాసెస్ ధరించి కనిపిస్తాడు.  

mahindra group Anand Mahindra Keeps His Promise, Shares A Rare Selfie pic On Twitter

మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా  సోషల్ మీడియాలో చాలా ఆక్టివ్ గా ఉంటారన్నది మీకు తెలిసిందే. అయితే ఎప్పుడు వింతైన, అరుదైన ఫోటోలను షేర్ చేసే ఆనంద్ మహీంద్రా తన సొంత ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం చాలా అరుదు.

తాజాగా ఆదివారం ఆనంద్ మహీంద్రా తన అరుదైన సెల్ఫీ ఫోటోని పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో సన్ గ్లాసెస్ ధరించి కనిపిస్తాడు.  

మార్చి 6న అహ్మదాబాద్‌లో జరిగిన నాల్గవ టెస్టులో ఇంగ్లండ్‌పై భారత విజయం సాధించినందుకు క్రికెట్ జట్టును మెచ్చుకుంటూ  ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. తన ట్వీట్‌లో సన్ గ్లాసెస్ ధరించిన ఆక్సర్ పటేల్ ఫోటోని షేర్ చేశాడు.

అయితే ఆక్సర్ పటేల్ కనబరిచిన అద్భుతమైన ప్రదర్శన ఇండియా మ్యాచ్ గెలవటానికి సహాయపడింది. ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి నేను ఈ సన్ గ్లాసెస్ పొందాలి" అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ లో పేర్కొన్నారు.

also read  కియా, హ్యుందాయ్, నిస్సాన్ కార్లకు పోటీగా స్కోడా కొత్త కార్ వచ్చేసింది.. బుకింగ్స్, డెలివరీలు ఎప్పుడంటే.

అతను తక్కువ సమయంలోనే ఆ షేడ్స్‌ను సంపాదించగలిగాడు. భారతదేశం-ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండవ టి20 అంతర్జాతీయ మ్యాచ్‌ను ఇంట్లో చూసేటప్పుడు వాటిని ధరించాడు. ఆనంద్ మహీంద్రా తనకు ఇంట్లో మ్యాచ్ చూసేటప్పుడు షేడ్స్ అవసరం లేదని తనకు తెలుసునని, కానీ దానిని అదృష్టం, ఆశాభావంగా వ్యక్తం చేశారు.

తన ఫాలోవర్స్ లో ఒకరు ఆనంద్ మహీంద్రని ఆక్సర్ షేడ్స్ ధరించిన ఫోటోని షేర్ చేయాలని కోరినప్పుడు ఆనంద్ మహీంద్రా ఇంగ్లాండ్‌తో టి20 సిరీస్‌ను భారత్ గెలిచినట్లయితే  తప్పకుండ చేస్తానని వాగ్దానం చేశాడు.  

ఈ ఆదివారం ఐదవ టీ20 ఇంటర్నేషనల్‌లో భారత్ 36 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి సిరీస్‌ను  గెలిచాక ఆనంద్ మహీంద్రా తన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. తాను సన్‌గ్లాసెస్ ధరించిన ఫోటోని షేర్ చేశాడు.

"ఏ పారిశ్రామికవేత్త కూడా సోషల్ మీడియాలో చాలా కూల్ గా ఉండటం ఎప్పుడూ చూడలేదు" అని ఒక ట్విట్టర్ యూజర్ కామెంట్ చేస్తూ పోస్ట్ చేశారు. మరొకరు "వావ్ ... వాట్ ఏ విన్నింగ్ లుక్ ..." అంటూ కామెంట్ చేశారు.

ఆనంద్ మహీంద్రా గత ఏడాది ఫిబ్రవరిలో  కూడా ఒక ఫోటోని చెర్ చేశారు. గుజరాత్‌లోని నర్మదాకు ప్రయాణిస్తున్నప్పుడు కెవాడియాలోని ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం స్టాచ్యు ఆఫ్ యూనిటీ వద్ద  దిగిన ఒక ఫోటోని షేర్ చేశాడు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios