డ్యూయల్ ఎయిర్ బ్యాగ్‌లతో కొత్త మహీంద్రా బొలెరో.. పాత మోడల్ కంటే మరింత సురక్షితం, ధర, ఫీచర్లు మీకోసం..

 దేశంలోని చాలా వాహనాలపై డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలనే ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పుడు మహీంద్రా బొలెరోని  కొంచెం సురక్షితంగా చేసింది, ఎందుకంటే ఈ  ఎస్‌యూ‌వి ఇప్పుడు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో స్టాండర్డ్‌గా వస్తుంది.

Mahindra Bolero SUV now available with dual front airbags

గతకొంత కాలంలో భారతదేశంలో కొన్ని సురక్షితమైన కార్లను తయారు చేయడంలో పేరుగాంచిన మహీంద్రా  కంపెనీకి చెందిన బొలెరో ఇప్పుడు సెంసేషన్ సృష్టిస్తుంది. ఈ సెవెన్-సీటర్ ఎస్‌యూ‌వి  ధృడమైన బాడీ బిల్డ్  అండ్ కఠినమైన రోడ్లపై సాఫీగా దూసుకెళ్లగల సామర్థ్యం కారణంగా దేశంలో నమ్మశక్యంకాని ప్రజాదరణ పొందింది. అయితే దేశంలోని చాలా వాహనాలపై డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలనే ప్రభుత్వ ఉత్తర్వులు ఇప్పుడు మహీంద్రా బొలెరోని  కొంచెం సురక్షితంగా చేసింది, ఎందుకంటే ఈ  ఎస్‌యూ‌వి ఇప్పుడు డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లతో స్టాండర్డ్‌గా వస్తుంది.

భద్రతా ఫీచర్లు
కొత్త డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు ఇప్పటికే అందుబాటులో ఉన్నటువంటి ఏ‌బి‌ఎస్ విత్ ఈ‌బి‌డి రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఇతర భద్రతా ఫీచర్లతో పాటు వస్తుంది. స్పీడ్ అలర్ట్‌లు  స్టాండర్డ్ గా చేర్చబడింది.

ఫీచర్లు
ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌తో పాటు బొలెరో ఎక్విప్‌మెంట్ లిస్ట్‌లో ఇతర మార్పులు చేయలేదు. అంటే AUX అండ్ USB కనెక్టివిటీతో బ్లూటూత్- మ్యూజిక్ సిస్టమ్, మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్, కీలెస్ ఎంట్రీ, పవర్ స్టీరింగ్ ఇంకా సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను పొందుతుంది.

కొత్త నిబంధన అమల్లోకి వచ్చినప్పుడు భారతదేశంలో విక్రయించే అన్ని కొత్త వాహనాల్లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరిగా అమర్చాలనే నిర్ణయం జనవరి 2022 నుండి అమలులోకి వచ్చింది. ఇంతకుముందు మారుతి సుజుకి ఆల్టో, S-ప్రెస్సో, రెనాల్ట్ క్విడ్ ఇంకా మహీంద్రా బొలెరో వంటి  బడ్జెట్ కార్లు డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌తో మాత్రమే వచ్చేవి. ఇందులో ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు ప్రీమియం లేదా టాప్-స్పెక్ మోడల్‌లో ఆప్షన్ గా అందుబాటులో ఉంచాయి.

ఇంటీరియర్ లుక్ అండ్ డిజైన్
డ్యాష్‌బోర్డ్‌కు ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లను అందించగ మహీంద్రా ఇంటీరియర్లో కూడా చాలా మార్పులను చూస్తుంది. ఇంతకు ముందు, బొలెరో ప్యాసింజర్ సైడ్ డ్యాష్‌బోర్డ్‌లో ఆకర్షణీయమైన గ్రాబ్ హ్యాండిల్స్‌తో వచ్చేది. అయితే ఇప్పుడు సాధారణ డ్యాష్‌బోర్డ్ ప్యానెల్ అండ్ ప్యాసింజర్ వైపు కొత్త ఫాక్స్ వుడ్ గార్నిష్‌, ఏ‌సి వెంట్స్, మ్యూజిక్ సిస్టమ్ చుట్టూ సెంట్రల్ కన్సోల్‌లోని వుడ్-ఫినిష్ ఉంటుంది.

కలర్ ఆప్షన్స్ 
మహీంద్రా బొలెరో కూడా కొత్త డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్ పొందవచ్చని భావించారు. అయితే బొలెరో కేవలం మూడు మోనోటోన్ పెయింట్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంటుంది - వీటిలో వైట్, సిల్వర్ ఇంకా బ్రౌన్ ఉన్నాయి.

ఇంజన్ అండ్ పవర్
మహీంద్రా బొలెరో పాత మోడల్ లాగానే 1.5-లీటర్, 3-సిలిండర్ డీజిల్ mHawk75 ఇంజన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ 75 హెచ్‌పి పవర్ ఇంకా 210 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేశారు, ఇంకా బ్యాక్ టైర్లకు మాత్రమే శక్తిని పంపుతుంది.

కొత్త ధర
మహీంద్రా  బొలెరో మూడు ట్రిమ్ లో అందుబాటులో ఉంది - B4, B6 ఇంకా B6 Opt. ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌లు ఎస్‌యూ‌విని కొంచెం ఖరీదైనవిగా మార్చాయి. దీని ధరలు వేరియంట్‌ను బట్టి రూ.14,000 నుండి రూ.16,000 వరకు ఉండొచ్చు. మహీంద్రా బొలెరో బి4 వేరియంట్ ధర రూ.9 లక్షలు కాగా, బి6 వేరియంట్ ధర రూ.9.8 లక్షలు.  టాప్-మోడల్ B6 ఆప్షనల్ వేరియంట్ కోసం దీని ధర రూ. 10 లక్షలు. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios