Mahindra Bolero: డ్యూయ‌ల్ ఎయిర్‌బ్యాగ్స్‌తో మహీంద్రా బొలెరో.. ధర ఎంతో తెలుసా?

మహీంద్రా కంపెనీ మహీంద్రా బొలెరో ఇప్పుడు కొత్త భద్రతా నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది. ఈ అప్డేట్ కారణంగా ఈ SUV ధరలు కూడా మునుపటి కంటే కూడా రూ. 14,000 నుండి రూ. 16,000 వరకు పెరిగాయి.

Mahindra Bolero Dual Airbags

భారతీయ వాహన తయారీ సంస్థ 'మహీంద్రా అండ్ మహీంద్రా' (Mahindra & Mahindra) తన ప్రసిద్ధ SUV అయిన 'మహీంద్రా బొలెరో' (Mahindra Bolero) అన్ని వేరియంట్లలోనూ డ్యూయల్-ఎయిర్‌బ్యాగ్ ఫీచర్‌తో అప్‌డేట్ చేయనున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు కంపెనీ మహీంద్రా బొలెరోను డ్యూయల్ ఎయిర్ బ్యాగ్‌లతో అప్‌డేట్ చేసింది. అంతే కాకుండా ఈ కొత్త SUV ధరలను కూడా అధికారికంగా వెల్లడించింది. 

మహీంద్రా కంపెనీ మహీంద్రా బొలెరో ఇప్పుడు కొత్త భద్రతా నిబంధనలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది. ఈ అప్డేట్ కారణంగా ఈ SUV ధరలు కూడా మునుపటి కంటే కూడా రూ. 14,000 నుండి రూ. 16,000 వరకు పెరిగాయి. ఈ ధరల పెరుగుదల కారణంగా ఇప్పుడు 'మహీంద్రా బొలెరో' ప్రారంభ ధర రూ. 8.85 లక్షలు (ఎక్స్-షోరూమ్). అదే విధంగా ఇందులోని టాప్ వేరియంట్ ధర రూ. 9.86 లక్షలకు చేరిపోయింది.

మహీంద్రా బొలెరో ఇంతకుముందు డ్యాష్‌బోర్డ్ ఫ్రంట్ ప్యాసింజర్ కోసం గ్రాబ్ హ్యాండిల్‌తో వచ్చింది. అయితే, ఎయిర్‌బ్యాగ్ అప్‌డేట్ తర్వాత ఇప్పుడు తీసివేయబడింది. ఎందుకంటే ఎయిర్‌బ్యాగ్ అసెంబ్లీ ఇప్పుడు డాష్‌బోర్డ్ వెనుక ఉంది. కావున మహీంద్రా డ్యాష్‌బోర్డ్ ప్యానెల్‌ను రీడిజైన్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది వుడ్ ఫినిషింగ్, మ్యూజిక్ సిస్టమ్, సెంట్రల్ కన్సోల్‌లో ఎయిర్ కండిషనింగ్ వెంట్స్‌తో వస్తుంది.

కొత్త అప్డేటెడ్ మహీంద్రా బొలెరోని ఇతర అప్‌డేట్‌ల విషయానికి వస్తే, ఇందులో కొత్త క్లియర్ లెన్స్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ముందు భాగంలో కొత్త బంపర్ ఉంది, ఇది మెటల్‌తో తయారు చేయబడి ఉంటుంది. ఇది ఇప్పటికీ 7-సీటర్ వెహికల్ గానే ఉంది. ఈ SUV బూట్ వద్ద రెండు వైపులా ఉండే సీట్లు ఉన్నాయి.

మహీంద్రా బొలెరో (Mahindra Bolero) డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. మహీంద్రా వీటిని విడుదల చేయనప్పటికీ, బొలెరో కేవలం మూడు పెయింట్ స్కీమ్స్ తో అందించబడుతుంది. ఇందులో బ్రౌన్, వైట్, సిల్వర్ కలర్స్ ఉన్నాయి. మహీంద్రా బొలెరో బి4, బి6, బి6(ఓ) వంటి అన్ని వేరియంట్లు మొత్తం మూడు వేరియంట్‌లలో అందించబడుతుంది. టాప్-ఎండ్ వేరియంట్‌లో స్టాటిక్ బెండింగ్ హెడ్‌ల్యాంప్‌లు, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే, డిజిటల్ డేట్, టైమ్, వాషర్, ఫాగ్ ల్యాంప్‌లతో రియర్ వైపర్ వంటివి ఉన్నాయి.

ఇప్పుడు బి4 వేరియంట్ నుండి బి6 వేరియంట్‌కి అప్‌గ్రేడ్ చేస్తే ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 70 లీటర్ల నుండి 60 లీటర్లకు తగ్గుతుంది. బి6 వేరియంట్‌లో వినైల్‌కు బదులుగా ఫాబ్రిక్ అపోల్స్ట్రే కూడా ఉపయోగించారు. అంతే కాకుండా.. ఇందులో పవర్ విండోస్, 12వి ఛార్జింగ్ సాకెట్, సెంట్రల్ లాకింగ్, కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ మ్యాప్ పాకెట్స్, యుటిలిటీ స్పేస్,  కీలెస్ ఎంట్రీ వంటివి ఉన్నాయి. మహీంద్రా బొలెరోలో అప్డేటెడ్ ఫీచర్స్ మాత్రమే కాకుండా.. కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు కూడా ఇవ్వబడ్డాయి. ఇందులో బి6 వేరియంట్‌లో డీకాల్స్, ఫ్రంట్ గ్రిల్ కోసం క్రోమ్ బెజెల్, సెంట్రల్ బెజెల్‌లో వుడ్ ఫినిషింగ్, మ్యూజిక్ సిస్టమ్, బాడీ కలర్ అవుట్‌సైడ్ రియర్‌వ్యూ మిర్రర్ ఉన్నాయి.

మహీంద్రా బొలెరో కేవలం ఒక డీజిల్ ఇంజన్‌తో మాత్రమే అందుబటులో ఉంది. ఇందులో 1.5 లీటర్, త్రీ-సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 75 బిహెచ్‌పి పవర్ శక్తిని, 210 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఇది మొత్తానికి మంచి పనితీరుని అందిస్తుంది. 

ఇక ఇందులోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో రియర్ పార్కింగ్ సెన్సార్‌లతో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సీట్‌బెల్ట్ రిమైండర్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారుల భద్రతను నిర్ధరిస్తాయి. మహీంద్రా బొలెరోకు దేశీయ మార్కెట్లో ప్రస్తుతం ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే ఈ SUV ధరను దృష్టిలో ఉంచుకుని హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా, టయోటా అర్బన్ క్రూయిజర్, నిస్సాన్ మాగ్నైట్, టాటా నెక్సాన్, రెనాల్ట్ కైగర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios