కవాసకి కొత్త బైక్.. 4 సెకండ్లలో టాప్ స్పీడ్.. బైక్ ని నచ్చినట్టు సెట్ చేయవచ్చు..

బైక్‌లో చేసిన మార్పుల గురించి మాట్లాడితే కొత్త పెయింట్ స్కీమ్ Z900 కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ రిఫ్రెష్ చేస్తుంది. ఫ్రేమ్ అండ్ అల్లాయ్ వీల్స్ కలర్ స్కీమ్ ఆధారంగా రెడ్ ఇంకా గ్రీన్ కలర్ ఆప్షన్‌లను పొందుతాయి. 

Kawasaki launches new Z900 in India know its price  features and top speed

జపాన్ కంపెనీ కవాసకి బైక్  జెడ్900ని ఇండియన్ మార్కెట్‌లో  లాంచ్ చేసింది. అయితే ఈ బైక్ కి ఎలాంటి మెకానికల్ అప్‌గ్రేడ్ చేయలేదు కానీ కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ స్కీమ్ రూపంలో కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌ లభిస్తుంది. అలాగే మెటాలిక్ ఫాంటమ్ సిల్వర్‌తో మెటాలిక్ కార్బన్ గ్రే, ఎబోనీ కలర్ స్కీమ్‌లతో మెటాలిక్ మ్యాట్ గ్రాఫేన్ స్టీల్ గ్రేని కూడా పొందుతుంది. ఈ రెండు షేడ్స్‌కు ధర సమానంగా ఉంటుంది.
కవాసకి జెడ్900 ఎక్స్-షోరూమ్ ధర రూ. 8.93 లక్షలు.

బైక్‌లో చేసిన మార్పుల గురించి మాట్లాడితే కొత్త పెయింట్ స్కీమ్ Z900 కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ రిఫ్రెష్ చేస్తుంది. ఫ్రేమ్ అండ్ అల్లాయ్ వీల్స్ కలర్ స్కీమ్ ఆధారంగా రెడ్ ఇంకా గ్రీన్ కలర్ ఆప్షన్‌లను పొందుతాయి. బైక్‌కి అగ్రెసివ్ ఎల్‌ఈ‌డి హెడ్‌ల్యాంప్‌లు, ట్యాంక్ ష్రూడ్‌లతో మస్కులర్ ఫ్యుయెల్ ట్యాంక్, స్ప్లిట్ సీట్ సెటప్, Z- ఆకారపు ఎల్‌ఈ‌డి టెయిల్ ల్యాంప్‌ పొందుతుంది.

కవాసకి Z900948 cc, ఇన్‌లైన్ 4-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ BS-VI ఇంజన్‌ పొందుతుంది. ఈ బైక్ 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 123.6 బిహెచ్‌పి, 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 98.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు.

ఫీచర్ల గురించి మాట్లాడితే Z900 ట్రాక్షన్ కంట్రోల్‌తో వస్తుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే, వెనుక టైర్ ట్రాక్షన్ కోల్పోయిందని గుర్తించినప్పుడు పవర్ డెలివరీని తగ్గిస్తుంది. దీనిలో రెండు పవర్ మోడ్‌లు ఉన్నాయి- లో పవర్ అండ్ ఫుల్ పవర్. లో పవర్ మోడ్‌లో దీని అవుట్‌పుట్ 55 శాతానికి పరిమితం చేసింది. అలాగే నాలుగు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి - స్పోర్ట్, రోడ్, రెయిన్ ఇంకా రైడర్. రైడర్ మోడ్‌లో డ్రైవర్  ఛాయిస్ ప్రకారం బైక్ ని సెట్ చేయవచ్చు. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం కీలక వివరాలను చూపే TFT స్క్రీన్ ఉంది అంతేకాదు బ్లూటూత్ కనెక్టివిటీకి కూడా సపోర్ట్ చేస్తుంది.

సస్పెన్షన్ కోసం ముందు వైపున 41ఎం‌ఎం యూ‌ఎస్‌డి ఫోర్క్స్, వెనుక వైపున మోనో-షాక్ ఇచ్చారు. కవాసకి బలమైన ఉక్కుతో చేసిన ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను ఈ బైక్ కోసం ఉపయోగించింది. బ్రేకింగ్ కోసం ముందు డ్యూయల్ 300 ఎం‌ఎం పెటల్ డిస్క్, వెనుక భాగంలో 250 ఎంఎం పెటల్ డిస్క్‌లను పొందుతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios