Asianet News TeluguAsianet News Telugu

రూ.4.7 కోట్ల కారులో ఎలుక ఎం చేసిందో తెలుసా.. లక్షలు ఖర్చుపెట్టిన హీరో!

బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న నటుడిగా ఎదిగాడు. నిత్యం సినిమాలు, షూటింగులు, ప్రమోషన్స్ తో బిజీగా ఉండే కార్తీక్ ఆర్యన్ కి ఓ ఎలుక కారణంగా లక్షల రూపాయల నష్టం వాటిల్లింది.
 

Karthik Aryan lost lakhs of rupees from rat, McLaren car of Rs 4.7 crore belonging to garage!-sak
Author
First Published Jun 11, 2024, 11:39 PM IST

ముంబై: చందు ఛాంపియన్ సినిమాతో సంచలనం సృష్టించిన బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్‌లో చాలా డిమాండ్ ఉన్న హీరోగా  వెలుగొంది  షూటింగులు, సినిమాలతో సహా చాల కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. అయితే తాజాగా కార్తీక్ ఆర్యన్ కు లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. అవును నిజమే.. ఎందుకు ఎలా అని అనుకుంటున్నారా..  ఒక ఎలుక కారణంగా కార్తిక్ ఆర్యన్‌కి లక్ష రూపాయలు ఖర్చయింది. అసలు విషయం ఏంటంటే  నిత్యం బిజీగా ఉండడం వల్ల తన రూ.4.7 కోట్ల విలువైన మెక్‌లారెన్ కారు వైర్లు, మ్యాట్‌లను ఎలుకలు పాడు చేశాయి.

2022లో భూల్ భూలయ్య 2 సినిమాతో హీరో కార్తీక్ ఆర్యన్‌కు భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతోపాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా సక్సెస్ తర్వాత టి-సిరీస్ బాస్ భూషణ్ కుమార్ కార్తీక్ ఆర్యన్‌కి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. అదే రూ.4.7 కోట్ల విలువైన మెక్‌లారెన్ జీటీ కారు.

Karthik Aryan lost lakhs of rupees from rat, McLaren car of Rs 4.7 crore belonging to garage!-sak

కార్తీక్ ఆర్యన్ దగ్గర మరో కొన్ని ఖరీదైన కార్లు  కూడా  ఉన్నాయి. వీటిలో మెక్‌లారెన్ సూపర్ కారు ఒకటి. కార్తీక్ ఆర్యన్ షూటింగ్,  సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ మెక్‌లారెన్ కారును ఉపయోగించలేకపోయాడు. దీంతో ఇంట్లోనే  ఉన్న మెక్‌లారెన్ కారుపై ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో గాని ఎలుకలు దాడి చేశాయి. దింతో కార్ మ్యాట్, వైర్లు కొరికి వేయడంతో  పాడైపోయాయి.

చివరికి మెక్ లారెన్ కారును స్టార్ట్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. మెక్‌లారెన్ కారును రిపేర్ చేయమని షోరూమ్‌ను కోరారు. తరువాత మెక్‌లారెన్ కారుని షోరూమ్‌కి తీసుకెళ్లగా ఇప్పుడు కారు సరిచేయాలంటే లక్షల రూపాయలు  ఖర్చవుతుందని చెప్పారట. ఈ విషయాన్ని స్వయంగా కార్తీక్ ఆర్యన్ ఒక  ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

అయితే కార్తీక్ ఆర్యన్ ఎక్కువగా రేంజ్ రోవర్ కారును ఉపయోగిస్తాడు. దీనిని ఇటీవల కొన్నారు. ఈ కార్లు కాకుండా మరికొన్ని లగ్జరీ  కార్లు కూడా ఉన్నాయి. 

Karthik Aryan lost lakhs of rupees from rat, McLaren car of Rs 4.7 crore belonging to garage!-sak

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios