Asianet News TeluguAsianet News Telugu

రెండేళ్లలోపే ప్యాకప్: విద్యుత్ వెహికల్స్‌కు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ నో

విద్యుత్ వాహనాల ఉత్పత్తిలో అడుగు పెట్టాలని రెండేళ్ల క్రితం జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ తీసుకున్న నిర్ణయం నుంచి వెనుకంజ వేసింది. విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాల్లో అనిశ్చితి, నిత్యం పెట్టుబడి కొనసాగించాల్సిన అవసరం నేపథ్యంలో జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ పేర్కొన్నది.

JSW Energy shuns electric vehicles entry plans
Author
Mumbai, First Published Apr 5, 2019, 10:47 AM IST

ముంబై: సజ్జాన్ జిందాల్ సారథ్యంలోని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నది. నిర్ణయం తీసుకున్న రెండేళ్లలోపే దాన్ని ఉపసంహరించుకున్నది. విద్యుత్ వాహనాలను ఉత్పత్తి చేయాలని తీసుకున్న నిర్ణయం నుంచి వెనుకడుగు వేసింది. వ్యక్తిగత వాహనాల కొనుగోలు పట్ల ప్రభుత్వ అననుకూల విధానం, విద్యుత్ వాహనాల విధానంలో అనిశ్చితి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని జేఎస్ డబ్ల్యూ ఎనర్జీ వెనుకడుగు వేసిందని తెలుస్తోంది. 

జనరల్ మోటార్స్ తో కలిసి విద్యుత్ వాహనాల ఉత్పత్తికి రూ.6,500 కోట్ల ఖర్చుకూ రెడీ
జనరల్ మోటార్స్‌తో కలిసి విద్యుత్ వాహనాల ఉత్పత్తి కోసం రూ.6,500 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రయత్నాలు సాగించింది. ఇందుకోసం మహారాష్ట్రలో పుణె నగరానికి సమీపంలో జనరల్ మోటార్స్ తాలేగావ్ జనరల్ మోటార్స్ ఉత్పత్తి కేంద్రాన్ని స్వాధీనం చేసుకునే అంశంపై చర్చలు అడ్వాన్స్ దశలో ఉన్నట్లు సరిగ్గా నెల రోజుల క్రితం వార్తలు వచ్చాయి. 

రిస్క్ మేనేజ్మెంట్‌పై ఇలా వివేకం
కానీ పుణెలోని సదరు ఉత్పత్తి కేంద్రం స్వాధీనంపై జనరల్ మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ చర్చలు వెనుక పట్టు పట్టాయి. రిస్క్ మేనేజ్మెంట్ పట్ల వివేకంతో వ్యవహరిస్తూ విద్యుత్ వాహనాల తయారీ ప్రతిపాదన నుంచి వెనుకడుగు వేస్తున్నట్లు బీఎస్ఈ పైలింగ్‌లో పేర్కొంది. 

ఫేమ్ -2 చూశాకే వైదొలుగాలని జేఎస్‌డబ్ల్యూ 
జాగ్రత్తగా అంచనాలు వేసిన తర్వాత విద్యుత్ వాహాన, ఇతర సంబంధ వ్యాపారాల్లోకి అడుగు పెట్టరాదని నిర్ణయించామని జేఎస్‌డబ్ల్యూ తెలిపింది. గత నెల ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం ‘ఫేమ్-2’ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. విద్యుత్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు రూ.10 వేల కోట్ల విలువైన రాయితీలను ప్రకటించింది.  

జేఎస్‌డబ్ల్యూ లివింగ్‌ రూ.250 కోట్ల పెట్టుబడులు
ఉక్కు ఫర్నీచర్‌ విభాగంలోకి ఫోర్మా బ్రాండ్‌తో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ సంస్థ జేఎస్‌డబ్ల్యూ లివింగ్‌ అడుగుపెట్టింది. వచ్చే రెండేళ్లలో రూ.200 కోట్ల ఆదాయంపై కన్నేసిన సంస్థ 2024-25 నాటికి రూ.1000 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయిదేళ్లలో ఫోర్మాపై దాదాపు రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ వెల్లడించింది. 

ముందు ఇళ్ల ఫర్నీచర్.. తర్వాత ఆఫీసు ఫర్నీచర్‌పై ఫోకస్
ప్రస్తుతం గృహాల ఫర్నీచర్‌పై దృష్టి పెట్టామని, భవిష్యత్‌ కార్యాలయ ఫర్నీచర్‌ విభాగంపై దృష్టి పెట్టనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ లివింగ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తరిణి జిందాల్‌ హండా పేర్కొన్నారు. మొదటి ఏడాదిలోనే సానుకూల ఎబిటాను నమోదు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. 

ఫర్నీచర్ మార్కెట్ విలువ రూ.1.32 లక్షల కోట్లు
ప్రస్తుతం ఫర్నీచర్‌ విపణి విలువ దాదాపు రూ.1.32 లక్షల కోట్లుగా ఉంది. ఇందులో వ్యవస్థీకృత మార్కెట్‌ వాటా 16 శాతం 2022 నాటికి ఇది 30 శాతానికి, 2025కి ఈ వాటా 40 శాతానికి పెరుగుతుందని సంస్థ డైరెక్టర్‌ పార్థ్‌ జిందాల్‌ అశాభావం వ్యక్తం చేశారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నుంచి ఉక్కు తీసుకుంటామని, వెండర్లు దాన్ని ఫర్నీచర్‌గా మలుస్తారని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios