జీప్ 'మేడ్ ఇన్ ఇండియా' 7-సీటర్ ఎస్‌యూ‌వి.. 70 పేర్ల నుండి స్పెషల్ పేరు.. ఎందుకు ప్రత్యేకమైనదో తెలుసుకోండి..

జీప్ ఇండియా సోమవారం భారతీయ మార్కెట్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 7-సీటర్ ఎస్‌యూ‌వి పేరును ప్రకటించింది. ఈ వాహనం పేరు కోసం  అంతర్జాతీయ మార్కెట్లలోని కొన్ని గ్లోబల్ జీప్ పేర్లతో సహా 70 పేర్ల జాబితాను అధ్యయనం చేశారు. 
 

Jeep Coming 'Made in India' 7-seater SUV Jeep Meridian name selected from 70 names

మల్టీ నేషనల్ కార్పొరేషన్ స్టేల్లంటిస్ జీప్ ఇండియా (jeep india) సోమవారం ఇండియన్ మార్కెట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 7-సీటర్ ఎస్‌యూ‌వి పేరును ప్రకటించింది. జీప్  ఈ కొత్త ఎస్‌యూ‌వి పేరుని జీప్ మెరిడియన్ (jeep meridian)అని తెలిపింది. భారతీయ మార్కెట్‌కు ఈ మోడల్ పేరును కస్టమర్ల కోసం కనెక్టికిటి, ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ పేరును జాగ్రత్తగా ఎంపిక చేసినట్లు కంపెనీ తెలిపింది. జీప్ మెరిడియన్ జీప్ బ్రాండ్  ప్రధాన డి‌ఎన్‌ఏను కలిగి ఉంటుంది.

జీప్ కోసం 70 పేర్ల జాబితా 
ఈ వాహనం పేరు కోసం  అంతర్జాతీయ మార్కెట్లలోని కొన్ని గ్లోబల్ జీప్ పేర్లతో సహా 70 పేర్ల జాబితాను అధ్యయనం చేశారు. అయితే, కంపెనీ ప్రకారం పూర్తిగా 'మేడ్ ఇన్ ఇండియా' అయిన ఎస్‌యూ‌వికి - మార్కెట్‌లో బలమైన కనెక్టివిటీ ఉన్న పేరు అవసరం. కొన్ని అందమైన రాష్ట్రాలు ఇంకా సంస్కృతులను కలుపుతూ భారతదేశం పొడవునా ఉన్న లైన్ నుండి ఈ పేరు ప్రేరణ పొందింది.

జీప్ మెరిడియన్ పూర్తిగా 'మేడ్ ఇన్ ఇండియా' ఎస్‌యూ‌విగా వస్తుంది. దీనితో పాటు గొప్ప డ్రైవింగ్ అనుభవాన్ని, ఫీచర్-రిచ్ క్యాబిన్‌ను అందిస్తుందని కంపెనీ హామీ ఇస్తుంది. 

'మేడ్-ఇన్-ఇండియా అండ్ మేడ్-ఫర్-ఇండియా'
జిప్ మెరిడియన్ భారతదేశంలో జీప్  మొట్టమొదటి 7-సీటర్ ఎస్‌యూ‌వి అవుతుంది అలాగే  జీప్ ఉత్పత్తి లైన్ ని బలోపేతం చేసే ఉత్పత్తిగా పరిగణించబడుతుంది. జీప్ ఇండియా హెడ్ నిపున్ జె మహాజన్ మాట్లాడుతూ, “కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలోని అన్ని రకాల భూభాగాల వరకు మేము ఎస్‌యూ‌విని పరీక్షించాము. జీప్ మెరిడియన్ ఎటువంటి లోపాలు లేకుండా బాగా పనిచేసిందని చెప్పడానికి మేము గర్విస్తున్నాము. మా కస్టమర్ల నుండి మెరిడియన్ అంచనాలను  మేడ్-ఇన్-ఇండియా మరియు మేడ్-ఫర్-ఇండియా రెండింటినీ ఈ రోజు అందించడానికి సంతోషిస్తున్నాము."అని అన్నారు.

ఈ ఏడాది లాంచ్ 
జీప్ ఇండియా మెరిడియన్ ఎస్‌యూ‌విని ఈ సంవత్సరం ఇండియాలో లాంచ్ చేయబడుతుందని ధృవీకరించింది. అయితే లాంచ్ చేయడానికి మరింత ఖచ్చితమైన సమయం కోసం  వేచి ఉండాలి. స్టెలాంటిస్ ఇండియా సి‌ఈ‌ఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రోలాండ్ బౌచారా మాట్లాడుతూ, "మార్కెట్లో మా ఉనికిని బలోపేతం చేయడానికి మేము  చేస్తున్న కృషి ఇంకా 2022 సంవత్సరానికి అలాగే ఇంకా ముందు మా ఉత్పత్తులు భారతదేశం పట్ల మా నిబద్ధతను ప్రతిబింబిస్తూనే ఉంటాయి."అని అన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios