జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఆటోమోటివ్ పిఎల్‌సి జాగ్వార్ ల్యాండ్ రోవర్ లిమిటెడ్ హోల్డింగ్ కంపెనీ. ఇది బ్రిటిష్ మల్టీ నేషనల్ ఆటోమోటివ్ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం విట్లీ, కోవెంట్రీ, యునైటెడ్ కింగ్‌డమ్ లో ఉంది. ఇది భారతీయ ఆటోమోటివ్ కంపెనీ టాటా మోటార్స్ అనుబంధ సంస్థ కూడా.

also read  యమహా కొత్త బి‌ఎస్-6 బైక్... అల్ న్యూ ఫీచర్స్

 జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థ సేల్స్ గత ఏడాది నవంబర్ 2018, నవంబర్ 2019 తో పోలిస్తే జాగ్వార్ ల్యాండ్ రోవర్ ప్రపంచ రిటైల్ అమ్మకాలు తగ్గాయి. ఈ ఏడాదిలో చేసిన మొత్తం అమ్మకాలు 46,542 వాహనాలు అంటే 3.4 శాతం అమ్మకాలు తగ్గాయి. చైనాలో మాత్రం  అమ్మకాలు కొంచెం మెరుగుపడి, అమ్మకాలు కిందటి ఏడాదితో పోల్చుకుంటే సంవత్సరానికి 29 శాతం పెరిగాయి.

అయితే వరుసగా ఐదవ నెలలో కూడా అమ్మకాలలో మంచి వృద్ధిని సూచిస్తుంది. ఉత్తర అమెరికా మార్కెట్లో కూడా అమ్మకాలు 4.9 శాతం పెరిగాయి. యు.కె దేశంలో అమ్మకాలు 10.8 శాతం, ఐరోపాలో కూడా 16.8 శాతం అమ్మకాలు క్షీణించింది. రేంజ్ రోవర్ ఎవోక్ రిఫ్రెష్ చేసిన ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్, ల్యాండ్ రోవర్ డిస్కవరీ, రేంజ్ రోవర్ స్పోర్ట్ అన్నీ నవంబర్ 2019 లో మంచి వృద్ధిని చూపించాయి.

2019 నవంబర్‌లో ల్యాండ్ రోవర్ చేసిన మొత్తం రిటైల్ అమ్మకాలు 35,078 వాహనాలు,కిందటి  సంవత్సరంతో పోల్చితే ఇది 5.5 శాతం పెరుగుదల కనిపిస్తుంది. జాగ్వార్ రిటైల్ అమ్మకాలు మొత్తం 11,464 వాహనాలు, ఇంతకు ముందు సంవత్సరంతో చూసుకుంటే ఇది 23.1 శాతం తగ్గుదల చూపిస్తుంది.

also read తొమ్మిది నెలల తర్వాత ‘మారుతి’ ఉత్పత్తి పెంపు


జాగ్వార్ ల్యాండ్ రోవర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ ఫెలిక్స్ బ్రాతిగమ్ మాట్లాడుతూ "గ్లోబల్ ఆటోమోటివ్ మార్కెట్లో తిరోగమనం నేపథ్యంలో, యుఎస్, చైనాలో మా అమ్మకాలు పెరగడం చూసి మేము సంతోషిస్తున్నాము ”అని అన్నారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ రిటైల్ అమ్మకాలు 2019-20 సంవత్సరానికి ఇప్పటి వరకు 345,976 కాగా, గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 5.9 శాతం తగ్గింది.