తక్కువ ధరకే మారుతి స్విఫ్ట్ కార్.. కొనేవారికి డిస్కౌంట్ అఫర్.. ఏ కార్లు ఉన్నాయో తెలుసా?

మారుతీ స్విఫ్ట్ ఈ నెలలో రూ.37,000  వరకు బెనిఫిట్స్  అందిస్తుంది.  ఇందులో రూ. 10,000 క్యాష్ బెనిఫిట్స్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇంకా  రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఇదిలా ఉండగా, CNG వేరియంట్లపై రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్ అందించబడుతుంది. 

Its Discount January.. Maruti Suzuki Offers Up To Rs 47,000 - Know Which Cars?-sak

ప్రముఖ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి కొత్త ఏడాది జనవరిలో కొన్ని కార్ల మోడల్స్ పై రూ.47,000 వరకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది. ఇప్పుడు న్యూ ఇయర్ కోసం కొత్త కార్ కొనాలని ప్లాన్  చేస్తున్నవారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఏ కార్ మోడల్స్ పై ఎలాంటి ఆఫర్స్ అందిస్తుందో చూద్దాం...

మారుతి సుజుకి ఆల్టో K10

మారుతి ఆల్టో K10 అన్ని పెట్రోల్ అండ్ CNG వేరియంట్‌లపై రూ. 47,000 వరకు తగ్గింపును అందిస్తుంది. ఇందులో రూ. 25,000 వరకు క్యాష్ బెనిఫిట్స్, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అండ్  రూ. 7,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్స్ ఉన్నాయి. ఆల్టో K10 1.0-లీటర్ త్రి-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో 67hp, 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది.

మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో

మారుతి సుజుకి S ప్రెస్సో ఆల్టో లాగే 67hp, 1.0-లీటర్ ఇంజన్‌తో 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇందులో CNG వేరియంట్‌ను కూడా ఉంది. S ప్రెస్సో అన్ని పెట్రోల్ వేరియంట్‌ల ధర పై రూ. 44,000  వరకు తగ్గింపు పొందండి. ఇందులో రూ. 23,000 క్యాష్ బెనిఫిట్స్, రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్, రూ.6,000 కార్పొరేట్ డిస్కౌంట్  సహా ఉన్నాయి. 

మారుతీ సుజుకి స్విఫ్ట్

మారుతీ స్విఫ్ట్ ఈ నెలలో రూ.37,000  వరకు బెనిఫిట్స్  అందిస్తుంది.  ఇందులో రూ. 10,000 క్యాష్ బెనిఫిట్స్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇంకా  రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉన్నాయి. ఇదిలా ఉండగా, CNG వేరియంట్లపై రూ. 15,000 ఎక్స్చేంజ్ బోనస్ అందించబడుతుంది. స్విఫ్ట్ 5-స్పీడ్ మాన్యువల్ అండ్ AMT గేర్‌బాక్స్ అప్షన్స్ 90 hp, 1.2 లీటర్ ఇంజన్‌తో శక్తిని పొందుతుంది. ఈ కార్   ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ఇంకా  టాటా టియాగోలకు పోటీగా నిలుస్తుంది.

అంతేకాదు మారుతి సుజుకి అనేక కార్లపై కూడా డిస్కౌంట్లను ప్రకటించింది, అయితే ఇవి రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి అని  గమనించాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios