Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో రామ నామం.. టెస్లా కార్లను ఉపయోగించి లైట్ షో..

అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట జరగనున్న నేపథ్యంలో అమెరికాలోని హిందువులు తమ ఆనందాన్ని అపూర్వంగా పంచుకున్నారు. టెస్లా కార్లను ఉపయోగిస్తూ అందరి దృష్టిని ఆకర్షించి  రామ్ పేరు సృష్టించారు. అంతే కాదు అమెరికాలో ఎక్కడ చూసినా జై శ్రీరామ్ నినాదాలు మార్మోగాయి. 
 

Indians living in America created the name of Ram using a Tesla car!-sak
Author
First Published Jan 19, 2024, 4:24 PM IST | Last Updated Jan 19, 2024, 4:24 PM IST

వాషింగ్టన్: అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ట వేడుకకు వారం రోజుల ముందు అమెరికాలోని 21 నగరాల్లో రామభక్తులు కార్ల ర్యాలీలు నిర్వహించారు. 

100 మందికి పైగా రామ భక్తులు టెస్లా కార్లను తీసుకొని వాషింగ్టన్ డీసీలోని మేరీల్యాండ్ శివారులోని ఫ్రెడరిక్ నగర్‌లోని శ్రీ భక్త ఆంజనేయ దేవాలయానికి శనివారం రాత్రి తరలివచ్చారు. వారు టెస్లా కార్ల ముఖ్య ఫీచర్లలో  ఒకదాన్ని ఉపయోగించారు. ఇందులో ఈ టెస్లా కార్ల స్పీకర్లు రాముడికి అంకితం చేసిన పాటను ప్లే చేస్తూ  ఉండగా, హెడ్‌లైట్‌లు లైట్ గేమ్ ప్లే చేసాయి. రామ్ అనే పేరును సృష్టించే ప్యాట్రన్లో  కార్లు పార్క్ చేయబడ్డాయి.


టెస్లా మ్యూజిక్ షో నిర్వాహకులు, విశ్వ హిందూ పరిషత్ ఆఫ్ అమెరికా ప్రకారం 200 మందికి పైగా టెస్లా కార్ల యజమానులు ఈ ఈవెంట్ కోసం నమోదు చేసుకున్నారు. ఈవెంట్ నిర్వాహకులు తీసిన డ్రోన్ ఫోట్టోలు  ఈ టెస్లా కార్లు 'RAM'గా కనిపించే విధంగా వరుసలో ఉన్నాయని చూపుతున్నాయి. 

“ఈరోజు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంలో మేము టెస్లా రామ్ భగవాన్ సంగీత కచేరీ చేసాము. గత 500 ఏళ్లుగా అయోధ్యలో రామమందిరం కోసం పోరాడుతున్న హిందువుల తరానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము’’ అని అమెరికా వరల్డ్ హిందూ కౌన్సిల్ ప్రెసిడెంట్ మహేంద్ర సాపా అన్నారు.

టెస్లా లైట్ షో రామమందిర ప్రారంభోత్సవ వేడుకల ప్రారంభాన్ని సూచిస్తుంది. జనవరి 20న ఇలాంటి లైట్ షోలను నిర్వహించాలని VHPA యోచిస్తోందని వాలంటీర్ ఆర్గనైజర్లలో ఒకరైన అనిమేష్ శుక్లా తెలిపారు.

అమెరికాలో రామమందిర వేడుకలకు సారథ్యం వహిస్తున్న వీహెచ్‌పీ అమెరికా శనివారం 21 నగరాల్లో కార్‌ ర్యాలీలు నిర్వహించింది. మరోవైపు అమెరికాలోని విశ్వహిందూ పరిషత్ 10కి పైగా రాష్ట్రాల్లో 40కి పైగా పెద్ద బిల్‌బోర్డ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios