భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో మందగమనం కొనసాగునే ఉంది. ఫిబ్రవరి నెల కూడా ఉపశమనం కలిగించలేక పోయింది.2020 ఫిబ్రవరిలో ఆటో పరిశ్రమ అమ్మకాలు 18.14 శాతం క్షీణించి 1,646,332 వాహనాలను విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో 2,034,597 యూనిట్లను విక్రయించింది.

also read ఏప్రిల్ నుంచి బిఎమ్‌డబ్ల్యూ కార్ల ఉత్పత్తి నిలిపివేత...

ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 7.61 శాతం తగ్గి 2,51,516 యూనిట్ల వద్ద ఉండగా, గత ఏడాది ఇదే నెలలో 2,72,243 యూనిట్ల అమ్మకాలు జరిపింది.అయితే, ఫిబ్రవరి 2019 తో పోలిస్తే 2020 ఫిబ్రవరిలో యుటిలిటీ వాహనాల అమ్మకాలు 0.10 శాతం పెరిగాయి.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ మాట్లాడుతూ ఫిబ్రవరి 2020లో అన్ని విభాగాలలో ఉత్పత్తి, టోకు పంపకాలలో బాగా క్షీణించడం వలన ఆటోమొబైల్ పరిశ్రమ కష్టాలను ఎదుర్కొంటోంది." అని అన్నారు.

also read సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఈ-ట్రాక్టర్‌ వచ్చేసింది...త్వరలో అందుబాటులోకి..

ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 14.68 శాతం తగ్గి 26,32,665 యూనిట్ల వద్ద ఉండగా, గత ఏడాది ఇదే కాలంలో 30,85,528 యూనిట్లును విక్రయించింది.ఆటొ పరిశ్రమ ఏప్రిల్ 2019 నుండి ఫిబ్రవరి 2020వరాకు ప్యాసింజర్ కార్లు, వాణిజ్య వాహనాలు, త్రీ-వీలర్లు, ద్విచక్ర వాహనాలు, క్వాడ్రిసైకిల్‌తో సహా మొత్తం 20,498,128 వాహనాలను ఉత్పత్తి చేసింది.