Asianet News TeluguAsianet News Telugu

మీకు తాగే అలవాటు ఉందా.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న టక్నాలజీ.. ఏంటో తెలుసుకోండి..

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ విద్యార్థుల విజయాలకు ప్రపంచం సెల్యూట్ చేసింది. అధునాతన టెక్నాలజీతో ఒక  ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేశారు. రైడర్ తాగి ఉంటే ఈ బైక్ స్టార్ట్ కాదు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 కి.మీ మైలేజ్ ఇవ్వగల ఈ బైక్ లో ఎమర్జెన్సీ ఫీచర్లు, హిల్ అసిస్ట్ సహా అనేక అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
 

India surprised the world, this bike will not start if you drink alcohol!-sak
Author
First Published Feb 28, 2024, 12:29 PM IST

ప్రయాగ్‌రాజ్ (ఫిబ్రవరి 28):  భారతదేశంలోని స్టార్టప్ కంపెనీలు, టెక్నాలజీ కాలేజీల విద్యార్థులు ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రతిరోజూ పరిశోధనలు చేస్తూ కొత్త కొత్త సర్ ప్రైజ్‌లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మోతీలాల్ నెహ్రూ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజనీర్స్ విద్యార్థులు కలిసి అధునాతన టెక్నాలజీ అండ్  గరిష్ట భద్రతతో కూడిన ఎలక్ట్రిక్ బైక్‌ను అభివృద్ధి చేశారు. విశేషం ఏంటంటే మీరు తాగితే ఈ ఎలక్ట్రిక్ బైక్ స్టార్ట్ కాదు. అంతే కాదు, స్టార్ట్ చేసిన తర్వాత మీరు మద్యం సేవించినా ఈ బైక్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవుతుంది. 

అలహాబాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సొసైటీ ఆఫ్ ఆటో ఇంజనీర్స్ సాధించిన విజయాలను భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచం ప్రశంసించింది. ఈ బైక్‌లో ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఆల్కహాల్ డిటెక్టర్ సెన్సార్‌ను అమర్చారు. ఈ సెన్సార్ ఆల్కహాల్‌ను వెంటనే గుర్తిస్తుంది. ఈ సెన్సార్ బైక్ మోటారుకు సిగ్నల్స్ ఇస్తుంది. ఆల్కహాల్ డిటెక్ట్ కానీ బైక్ మోటార్ స్టార్ట్ అవ్వదు.


మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రమాదాలు ఇంకా  విపత్తులను నివారించడానికి ఈ ఫీచర్‌లు అభివృద్ధి చేయబడ్డాయి. ఈ బైక్‌లో భద్రత కోసం అనేక ఫీచర్లు ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే బైక్ ఆటోమాటిక్ గా  SoSకి ఎమర్జెన్సీ కాల్ చేస్తుంది. ఇది ప్రమాదం జరిగిన ప్రదేశంతో సహా ఇతర సమాచారాన్ని అందిస్తుంది. దీంతో అత్యవసర సేవలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోగలవు. 

దీనిలో కూడా కార్లలో లాగే హిల్ అసిస్ట్ ఫీచర్ ఉంది. ఎత్తైన రోడ్లు, కొండ రహదారులపై బైక్ ఆపివేస్తే, హిల్ అసిస్ట్ ఫీచర్ల కారణంగా బైక్ వెనుకకు కదలదు. కాబట్టి మీరు ఆందోళన లేకుండా బైక్‌ను నడపవచ్చు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల మైలేజీ లభిస్తుంది. ఇంకా  మీరు గరిష్టంగా 70 kmph వేగంతో ప్రయాణించవచ్చు.

స్మోక్ సెన్సార్ 
ఈ  బైక్‌లో ఏదైనా మంటలు లేదా పొగ వ్యాపించి ఉంటే అలర్ట్ ఇస్తుంది. దీంతో పాటు బైక్ చుట్టూ మంటలు, పొగలు వచ్చినా అలర్ట్ ఇస్తుంది. బైకుని దొంగతనం చేయకుండా  దీనిలోని ఫీచర్ బైక్ దొంగిలించబడకుండా నిరోధిస్తాయి. ఈ బైక్ ధర 1.30 లక్షల రూపాయలు. 

Follow Us:
Download App:
  • android
  • ios