Asianet News TeluguAsianet News Telugu

క్యాబ్ ఛార్జీలు పెరిగితే ఇలా చేయండి.. వెంటనే రీఫండ్ వస్తుంది..

తరచుగా మనము క్యాబ్ ఛార్జీలను తగ్గించుకోవడానికి కూపన్‌లు లేదా ఆఫర్‌లను వాడుతుంటాం, ఇలా చేయడం ద్వారా డబ్బు ఆదా చేయవచ్చు. కానీ కొన్ని కారణాల వల్ల ఒక్కోసారి మొదట చూపించిన దాని కంటే క్యాబ్ ఛార్జీలు పెరిగిపోతుంటాయి. ఇలాంటి సమయంలో  రిటర్న్ ఎలా పొందాలి, ఎం చేయాలి అనేది చాలామందికి తెలియదు. అయితే ఇలాంటి సమయాల్లో మీ డబ్బులు తిరిగిపొందే ఈ ట్రిక్ ఉపయోగించండి. 
 

If the fare increases due to the mistake of the cab driver, then do this, you will get the refund immediately-sak
Author
First Published Apr 6, 2024, 1:39 PM IST

ప్రస్తుతం విశ్వ నగరాలే కాదు చిన్నచన్న పట్టణాల్లో కూడా క్యాబ్స్ కల్చర్ వచ్చేసింది. ప్రజలు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి ఎక్కువగా క్యాబ్స్ ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం చాలా కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. అయితే తమ కస్టమర్లను పెంచుకునేందుకు ఈ కంపనీలు ప్రయాణ ఛార్జీలలో డిస్కౌంట్  కోసం కూపన్లు లేదా ఆఫర్లను అందిస్తాయి. ఈ కూపన్లు, ఆఫర్లను ఉపయోగించడం ద్వారా ఛార్జీలు కాస్త తగ్గుతాయి. క్యాబ్ కంపెనీలు  కస్టమర్లు తమ సేవలను మళ్లీ మళ్లీ ఉపయోగించుకునేందుకు ఇలా  చేస్తాయి. కానీ చాలా సార్లు బుకింగ్ సమయంలో ఛార్జీ తక్కువగా చూపించడం... గమ్యస్థానానికి చేరుకోగానే ఎక్కువగా చూపించడం జరుగుతుంటుంది. ఒక్కోసారి  కస్టమర్‌కి, క్యాబ్‌ డ్రైవర్‌కు మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిలో చిక్కుకుంటే ఏం చేస్తారు?... ఎవరితో గొడవ పడకుండా, మీ డబ్బులను వదులుకోకుండా వుండే ఉపాయం  వుంది. అదేంటో చూద్దాం.  

క్యాబ్ ఛార్జీలు ఎందుకు పెరుగుతాయి?

మీరు క్యాబ్‌ని బుక్ చేసినప్పుడు మీ గమ్యాన్ని చేరుకోవడానికి  యావరేజ్ టైం చూపుతుంది. కానీ కొన్నిసార్లు మీరు ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోతుంటారు. దింతో  మీకు ముందు చూపించిన టైంలో గమ్యాన్ని చేరుకోలేరు. ఇలాంటి పరిస్థితిలో, వాహనం ఎక్కువ ఇంధనం, రూట్ టైం  పెరుగుతుంది. ఇలాంటప్పుడే  యాప్ ఛార్జీలను పెంచడం ప్రారంభిస్తుంది. ఇందులో మీకు ఎవరూ సహాయం చేయలేరు.

క్యాబ్ డ్రైవర్లు ఛార్జీలను ఎలా పెంచుతారు?

చాలా సార్లు, మీరు తెలియని నగరంలో ఉన్నప్పుడు, కొంతమంది క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికి వాహనాన్ని దూరపు మార్గంలో తీసుకెళ్తుంటారు. ఇలా ఛార్జీలు  పెరుగుతాయి. కొంతమంది క్యాబ్ డ్రైవర్లు ఎక్కువ  డబ్బు సంపాదించడానికి ఈ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇలాంటప్పుడు ప్రయాణికులు దాని గురించి ఫిర్యాదు కూడా చేయవచ్చు.

ఇలా ఫిర్యాదు చేయండి

పెరిగిన ఛార్జీల గురించి కంప్లెయింట్  చేయడానికి యాప్‌లోకి వెళ్లి రైడ్‌ అప్షన్ ఓపెన్ చేయండి. దీని తర్వాత మీరు హెల్ప్  అప్షన్  చూస్తారు. ఇక్కడ  మీరు ఎక్కువ ఛార్జీలు వసూలు చేసే అప్షన్ కి వెళ్లండి. ఇప్పుడు మీరు చాట్ అండ్  కాల్ అప్షన్  చూస్తారు. ఇక్కడ  మీరు మీ ఫిర్యాదును రిజిస్టర్ చేసుకోవచ్చు. డ్రైవర్ పొరపాటు వల్ల ఛార్జీలు పెరిగినా లేదా కారణం లేకుండా పెరిగినా వెంటనే రిటర్న్ చేస్తారు. చాలా సార్లు కంపెనీ ఆ మొత్తానికి కూపన్ ఇచ్చి సెటిల్ చేసుకుంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios