న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుండాయ్ మోటార్స్ 2022 నాటికి అమెరికా విపణిలోకి 13 ఆల్టర్నేటివ్ ఫ్యుయల్డ్ వెహికల్స్‌ను ప్రవేశపెడతామని పేర్కొంది. ఆరు సెడాన్ కార్లు, ఏడు ఎస్‌యూవీ మోడల్ కార్లు తయారు చేయనున్నట్లు తెలిపింది. 

aslo read కేవలం 2 నెలల్లో 10వేల అమ్మకాలు: రెనాల్ట్ ఇండియా

వచ్చే ఏడాది ఆల్ న్యూ సొనాటా హైబ్రీడ్ ఎలక్ట్రిక్ సెడాన్ కారును అమెరికా మార్కెట్లో విడుదల చేయనున్నది. హ్యుండాయ్ మోటార్స్ కార్పొరేట్ అండ్ డిజిటల్ ప్లానింగ్ ఉపాధ్యక్షుడు మైక్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ వచ్చే మూడేళ్లలో తొమ్మిది పర్యావరణ అనుకూల కార్లను షో చేయనున్నట్లు ప్రకటించారు. 

వైవిధ్యభరితమైన కస్టమర్ బేస్ అవసరాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హ్యుండాయ్ మోటార్స్ కార్పొరేట్ అండ్ డిజిటల్ ప్లానింగ్ ఉపాధ్యక్షుడు మైక్ ఓబ్రెయిన్ అన్నారు. వ్యక్తిగత పర్యావరణ హిత రవాణా ఆప్షన్లను అందుబాటులోకి తెస్తామని మైక్ ఓబ్రెయిన్ తెలిపారు. 

aslor read విపణిలోకి ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్...అతి తక్కువ ధరకే...

ఇకముందు హ్యుండాయ్ మోటార్స్ పర్యావరణ హిత వాహనాలనే అందుబాటులోకి తేనున్నది. 2021 పరివర్తన సంవత్సరంగా నిలిచిపోనున్నది. 2021 కోనా విద్యుత్ కారు విపణిలోకి రానున్నది. 2021 నాటికి తొమ్మిది వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు హ్యుండాయ్ మోటార్స్ తెలిపింది.