దక్షిణ కొరియా ఆటో దిగ్గజం హ్యుందాయ్ మోటర్స్ ఇండియా వచ్చే సంవత్సరం జనవరి 2020  నుంచి కంపెనీ తన కార్ల అన్నీ మోడల్ కార్లపై ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటనతో హ్యుందాయ్ కంపెనీ మారుతి సుజుకి, కియా మోటర్స్ మరియు హీరో మోటో కార్ప్ సహా ఇతర కార్ల తయారీదారుల జాబితాలో చేరింది. 

also read జనవరి నుండి ఆ బైక్ ధరలు పెంపు... అసలు కారణం ఏంటి ?

హ్యుందాయ్ ప్రస్తుతానికి ధరల పెరుగుదలపై పూర్తి వివరాలను వెల్లడించలేదు. అయితే  సంస్థ ఇన్పుట్ మరియు మెటీరియల్ ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కార్ మోడల్ మరియు ఇంధన రకాన్ని బట్టి ధరలో మార్పు ఉంటుంది అని ఒక ప్రకటనలో తెలిపింది.

మారుతి సుజుకి, కియా మోటర్స్ రెండూ ఉత్పత్తి శ్రేణిలో ధరలను పెంచుతాయి. అయితే ఎంతవరకు పెంపు ఉంటుంది అనే మొత్తాన్ని ఇంకా ప్రకటించలేదు. హీరో మోటో కార్ప్ సంస్థ తన ద్విచక్ర వాహనాలలో మోడల్‌ను బట్టి  రూ.2000 వరకు ధరలలో పెరుగుదల ఉంటుందని చెప్పారు.

also read బజాజ్ పల్సర్ NS200 అడ్వెంచర్ ఎడిషన్

కంపెనీ తయారీదారులు మొదట పెంపును ప్రకటించాక త్వరలో మరిన్ని కంపెనీలు దీనిని అనుసరిస్తాయని భావిస్తున్నారు. టాటా మోటార్స్ వచ్చే ఏడాది జనవరి నుంచి ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. బిఎస్ 6 వెర్షన్లలో ప్యాసెంజర్ వాహనాలకు 10,000-15,000వేల వరకు పెరుగవచ్చని తెలిపింది.