ప్రపంచంలోని అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కంపెనీ తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.  1 జనవరి 2020 నుంచి ఇది అమల్లోకి వచ్చే విధంగా చూస్తుంది. పెంచిన ధరలోని మార్పులు ఎక్స్-షోరూమ్ ధరలపై  రూ. 2000 వరకు ఉంటుంది. అయితే బైక్ మోడల్ మరియు రిజనల్ మార్కెట్‌ను బట్టి ధరలో మార్పు ఉంటుంది. 

also read యమహా కొత్త బి‌ఎస్-6 బైక్... అల్ న్యూ ఫీచర్స్


ఈ సంవత్సరంలో ధరల పెరుగుదల అసాధారణం ఏం కాదు. చాలా వరకు వాహన తయారీదారులు కొత్త క్యాలెండర్ సంవత్సరానికి ధరల పెరుగుదలను ఎంచుకుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే కంపెనీ ధరలకు పెరుగుదలకు అసలు  కారణం ఏంటి  అనేది చెప్పలేదు.

 హీరో మోటోకార్ప్ కొత్త బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలు చెందుతున్నందున, అనేక బిఎస్ 4 వాహనాల ఉత్పత్తిని నిలిపివేసింది. సంస్థ బిఎస్ 6 ద్విచక్ర వాహనాల ఉత్పత్తి స్కేల్ ను పెంచే పనిలో ఉంది. వచ్చే ఏడాది ప్రారంభంలో అప్‌గ్రేడ్ చేసిన వాహనాలతో సిద్ధంగా ఉంటుంది. 

also read బజాజ్ పల్సర్ NS200 అడ్వెంచర్ ఎడిషన్


హీరో మోటోకార్ప్ మాత్రమే కాదు ఇతర ద్విచక్ర వాహనాల సంస్థలు కూడా వచ్చే ఏడాది నుంచి ధరలను పెంచుతాయని భావిస్తున్నారు. ఏదేమైనా కంపెనీలు బిఎస్ 6 వెర్షన్లను విడుదల చేయడంతో పాటు ధరలను కూడా పెంచే అవకాశం ఉంది.


కొత్త  బి‌ఎస్6 వాహనాలను విడుదల చేయడానికి  ఏప్రిల్ 2020 వరకు గడువును నిర్ణయించబడింది. ఇది పాత బిఎస్ 4 వాహనాల  ప్రస్తుత జాబితాలను క్లియర్ చేయడానికి డీలర్లకు మరియు వాహన తయారీదారులకు మరో నాలుగు లేదా మూడు నెలల సమయం పడుతుంది.