హ్యుందాయ్ కార్ల ధరపై కీలక ప్రకటన.. జనవరి 2023 నుండి అన్నీ మోడల్స్ కి వర్తింపు..

 హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల ధరల పెంపు ప్రకటించిన మార్కెట్ లీడర్ మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్, మెర్సిడెస్-బెంజ్, ఆడి, రెనాల్ట్, కియా ఇండియా, ఎం‌జి మోటార్ వంటి కంపెనీల లిస్ట్ లో చేరింది.

Hyundai Motor announces price hike, will increase prices of its model range from January 2023

పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల కారణంగా హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) అన్నీ మోడల్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న వాహనాల తయారీ వ్యయం ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ వచ్చే ఏడాది జనవరి నుంచి వాహనాల ధరలను పెంచనుంది. ఈ మేరకు మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో కంపెనీ వెల్లడించింది. 

దీంతో హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల ధరల పెంపు ప్రకటించిన మార్కెట్ లీడర్ మారుతీ సుజుకి ఇండియా, టాటా మోటార్స్, మెర్సిడెస్-బెంజ్, ఆడి, రెనాల్ట్, కియా ఇండియా, ఎం‌జి మోటార్ వంటి కంపెనీల లిస్ట్ లో చేరింది, ఈ కంపెనీలు పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేయడానికి ప్రణాళికలను ప్రకటించాయి.  

హ్యుందాయ్ కంపెనీ ప్రకారం, వివిధ మోడల్స్ అండ్ వేరియంట్‌లను బట్టి ధరల పెంపు మారుతూ ఉంటుంది. పెరిగిన ఖర్చులో ఎక్కువ భాగం కంపెనీయే భరిస్తోందని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. అయితే,   HMIL కొనుగోలుదారుల పై ధరల ప్రభావాన్ని తగ్గించడానికి  ఇంటర్నల్ ప్రయత్నాలను కొనసాగిస్తుంది. HMIL మోడల్ కి సంబంధించిన కొత్త ధరలు జనవరి 2023 నుండి వర్తిస్తాయి.

హ్యుందాయ్ మోటార్ ఇండియా గత నెలలో అత్యధిక ఆన్యువల్ కార్స్ సేల్స్ ప్రదర్శించింది. కంపెనీ ప్రకారం, నవంబర్ నెలలో దేశీయంగా 48,003 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ నెలలో 16,001 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. కొరియన్ ఆటోమేకర్  కుములేటివ్ సేల్స్ సంఖ్య 64,004 యూనిట్లుగా ఉంది, 2021లో ఇదే నెలతో పోలిస్తే 36.4 శాతం పెరిగింది. 

హ్యుందాయ్  బెస్ట్ సెల్లింగ్ కార్ క్రెటా ప్రతినెల ఇంకా వార్షిక అమ్మకాలలో వృద్ధిని నమోదు చేసింది. దీనితో పాటు సబ్-కాంపాక్ట్ SUV వెన్యూ అభివృద్ధి చెందుతూనే ఉంది. హ్యుందాయ్  గ్రాండ్ i10 Nios, i20, Aura, Alcazar, Verna, Tushaw వంటి కార్లు కూడా గత నెలలో దాని వార్షిక అమ్మకాలు పెరిగాయి, ఇది కంపెనీకి గుడ్ న్యూస్. 

మరో వార్తలో, హ్యుందాయ్ మోటార్  గ్లోబల్ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ క్రాస్‌ఓవర్ ఐయోనిక్ 5ని ఇండియాలో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. వచ్చే ఏడాది జనవరిలో జరగనున్న ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో ఈ కారును ప్రదర్శించే అవకాశం ఉంది. హ్యుందాయ్ ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు బుకింగ్ డిసెంబర్ 20 నుండి ప్రారంభమవుతుంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios