దేశంలో రెండవ అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్  కొత్త 7 సీట్ల ఎస్‌యూవీని త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కొన్ని నివేదికల ప్రకారం క్రెటా-ప్రేరేపిత ఎస్‌యూవీ  ప్రపంచ అరంగేట్రం ఏప్రిల్ 6న ఉంటుంది. కొరియా కార్ల తయారీ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో ఆల్కాజార్ ఎస్‌యూవీ ఇప్పటికే 'అప్ కమింగ్' మోడల్‌గా జాబితా చేసింది. 2021 హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీ ప్రీ-బుకింగులు ఏప్రిల్ మధ్య నుండి ప్రారంభం కానుంది. 

ప్రత్యేకత ఏమిటి
కొరియా కార్ల తయారీ సంస్థ కొంతకాలంగా ఈ 7 సీట్ల ఎస్‌యూవీపై పనిచేస్తున్నారు. ఇది భారతదేశంలో హ్యుందాయ్ అత్యంత ప్రజాదరణ పొందిన ఎస్‌యూవీ క్రెటా  లాంగ్ వెర్షన్‌గా పరిగణించబడుతుంది. హ్యుందాయ్ కొత్త 7 సీట్ల ఎస్‌యూవీకి అల్కాజార్ అని పేరు పెట్టనున్నట్లు గత నెలలో ప్రకటించింది. ఈ కారు పేరును 2020లోనే కంపెనీ నమోదు చేసింది. 

ఈ ఎస్‌యూవీ పేరు అర్థం
హ్యుందాయ్ అల్కాజార్ ఎస్‌యూవీని ఇంతకు ముందు కూడా చాలాసార్లు రోడ్లపై గుర్తించారు. ఒక నివేదిక ప్రకారం హ్యుందాయ్ అల్కాజార్ స్టైలింగ్, డిజైన్ హ్యుందాయ్ క్రెటా లాగా ఉంటుంది. ఒక విధంగా ఇది క్రెటా ప్రీమియం వెర్షన్ కావచ్చు. అల్కాజార్ అంటే స్పానిష్ భాషలో కోట లేదా ప్యాలెస్. అందుకే హ్యుందాయ్ కొత్త ఎస్‌యూవీకి అల్కాజార్ అని పేరు పెట్టారు. మరోవైపు  ఈ ఎస్‌యూవీకి చాలా లగ్జరీ ఫీచర్లు ఇచ్చే అవకాశం ఉంది. 

also read మేడ్ ఇన్ ఇండియా ఎస్‌యూవీ జీప్ రాంగ్లర్ 2021 వచ్చేసింది.. ధర, ఫీచర్స్, ప్రత్యేకతలు మీకోసం.. ...

లుక్స్ అండ్ డిజైన్
ఈ ఎస్‌యూవీ ఔట్ సైడ్ భాగం గురించి చూస్తే ఆల్కాజార్‌లో హై-మౌంటెడ్ ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌ఎస్, ప్రస్తుత క్రెటాలో కనిపించే స్ప్లిట్ ఫ్రంట్ హెడ్‌ల్యాంప్‌లు లభిస్తాయని భావిస్తున్నారు. ఫ్రంట్ మెయిన్ గ్రిల్ కూడా కొత్తగా ఉంటుంది. అలాగే దాని బంపర్లలో స్పోర్టి లుక్ తీసుకొచ్చారు. అందుకే ఈ కారు కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. కొత్త ఎస్‌యూవీ 5 సీట్ల క్రెటా కంటే ఎక్కువ ప్రీమియం లుక్కింగ్ ఇస్తుంది. కారు వెనుక భాగంలో రిడిజైన్ చేసిన ఎల్‌ఈడీ టైల్ లైట్లు, బంపర్‌లతో కొత్త టెయిల్‌గేట్ లభిస్తుంది.

ఇంటీరియర్ అండ్ ఫీచర్స్ 
ఈ ఎస్‌యూవీ లోపలి భాగం గురించి మాట్లాడితే ఇందులో మొత్తం  మూడవ వరుస సీట్లు లభిస్తాయి, అంటే క్రేట కంటే మరో ఇద్దరు వ్యక్తుల సీటింగ్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఫీచర్స్ గురించి చూస్తే హ్యుందాయ్ అల్కాజార్ 2020 హ్యుందాయ్ క్రెటా ఎస్‌యూవీ నుండి మెరుగైన ఫీచర్లు, సౌకర్యాలు పొందవచ్చు. కొత్త ఎస్‌యూవీలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వెంటిలేటెడ్ సీట్లు, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ ఇంకా మరెన్నో ఫీచర్లతో కూడిన ఈ ఎస్‌యూవీలో బ్లూలైన్ కనెక్ట్ కార్ టెక్నాలజీ అందించారు.

ఇంజిన్ ఆప్షన్ 
సరికొత్త హ్యుందాయ్ 7 సీట్ల ఎస్‌యూవీ 5 సీట్ల క్రెటా ఎస్‌యూవీ లాగానే ఇంజిన్‌ను ఉపయోగించుకుంటుంది. ఇందులో 1.5-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.4-లీటర్ జిడిఐ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. కారు గేర్  ట్రాన్స్మిషన్ ఆప్షన్ కూడా క్రెటా లాగానే ఉంటుందని భావిస్తున్నారు. 

ధర 
భారత మార్కెట్లో ఈ 7 సీట్ల ప్రీమియర్ ఎస్‌యూవీ అల్కాజార్ ఎక్స్‌షోరూమ్ ధర రూ .14 లక్షల నుంచి రూ .20 లక్షల మధ్య ఉంటుంది. భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన తరువాత అల్కాజార్ ఎస్‌యూవీ ఈ విభాగంలో ఎంజి హెక్టర్ ప్లస్, టాటా సఫారి, 7 సీట్ల ఎస్‌యూవీ జీప్ కంపాస్, ఇతర వాహనాలతో పోటీ పడుతుంది.