Asianet News TeluguAsianet News Telugu

కారులో వాడే ఇంజన్ ఆయిల్ ఎన్ని రకాలు.. మీ కారుకు ఏ ఇంజన్ ఆయిల్ బెస్ట్ తెలుసుకోండి

సాధారణంగా మినరల్ ఆయిల్, సెమీ సింథటిక్ ఇంజన్ ఆయిల్, సింథటిక్ ఇంజన్ ఆయిల్ అనే మూడు రకాల ఇంజన్ ఆయిల్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. ఈ సమాచారాన్ని కార్ మాన్యువల్‌లో కార్ల తయారీదారులు కూడా అందిస్తారు.
 

How many types of engine oil are there, know which engine oil is best for your car
Author
First Published Sep 14, 2022, 5:41 PM IST

చాలా కంపెనీలు ఇండియాలో ఇంజిన్ ఆయిల్‌ను తయారు చేస్తున్నాయి. వీటిలో కొన్ని కంపెనీలు సాధారణ ఇంజన్ ఆయిల్‌ను తయారు చేసి కొన్ని రకాల ఇంజిన్ ఆయిల్‌లను మార్కెట్లో విక్రయిస్తాయి. వాటి మధ్య తేడా మీకు  తెలియకపోతే, ఈ వార్త  ద్వారా మీరు మీ కారులో ఎలాంటి ఇంజిన్ ఆయిల్ వాడలో కూడా తెలుసుకోవచ్చు, దీని ద్వారా మీ కారు లైఫ్ పెంచుతుంది. 

సాధారణంగా మినరల్ ఆయిల్, సెమీ సింథటిక్ ఇంజన్ ఆయిల్, సింథటిక్ ఇంజన్ ఆయిల్ అనే మూడు రకాల ఇంజన్ ఆయిల్‌లు మార్కెట్‌లో ఉన్నాయి. ఈ సమాచారాన్ని కార్ మాన్యువల్‌లో కార్ల తయారీదారులు కూడా అందిస్తారు.

మినరల్ ఇంజిన్ ఆయిల్
ఈ ఇంజిన్ ఆయిల్ చాలా కార్లలో ఉపయోగిస్తారు. ఈ ఆయిల్ రెఫైనేడ్ చేసిన పెట్రోలియం ఆయిల్. సాధారణ ఉష్ణోగ్రతలో మినరల్ ఇంజిన్ ఆయిల్ మెరుగ్గా పనిచేస్తుంది. ఫ్రిక్షన్ ద్వారా ఉత్పన్నమయ్యే వేడి నుండి రక్షించడానికి అవసరమైన రక్షణను అందించడం దీని పని. మార్కెట్‌లో లభించే ఇతర రకాల ఆయిల్ లలో ఇది చౌకైనది. 

సెమీ సింథటిక్ ఆయిల్
ఈ ఆయిల్ మినరల్ అండ్ సింథటిక్ ఆయిల్ మధ్య ఉంటుంది. అందువల్ల, దీని ధర మినరల్ ఆయిల్ కంటే ఎక్కువగా ఉంటుంది కానీ సింథటిక్ ఆయిల్ కంటే తక్కువగా ఉంటుంది. దీనికి తక్కువ మొత్తంలో సింథటిక్ ఆయిల్ కలుపుతారు కాబట్టి దీనిని సెమీ సింథటిక్ అంటారు. దీని వల్ల దాని సామర్థ్యం పెరుగుతుంది కానీ ధరలో పెద్దగా తేడా ఉండదు.  ఇది తక్కువ ఉష్ణోగ్రత లేదా అధిక ఉష్ణోగ్రతలో కూడా మంచి సామర్థ్యంతో పనిచేస్తుంది.

సింథటిక్ ఆయిల్
మార్కెట్‌లో ఇంతకంటే మెరుగైన ఇంజన్ ఆయిల్ అందుబాటులో లేదు. దీనిని బెస్ట్ లూబ్రికేటింగ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఈ ఆయిల్ చాలా తక్కువ ఇంకా అధిక ఉష్ణోగ్రతలలో బాగా పనిచేస్తుంది. సింథటిక్ ఆయిల్ కావడం వల్ల దీని ఫలితాలు కూడా మెరుగ్గా ఉంటాయి ఇంకా చాలా బాగా పని చేయడంతో పాటు ఇంజిన్‌లోకి  ధూళిని రాకుండా  ఆపేస్తుంది ఇంకా ఇంజిన్ లైఫ్ పొడిగిస్తుంది. మార్కెట్‌లో లభించే ఇతర ఇంజన్ ఆయిల్‌ల కంటే ఈ ఆయిల్ ఖరీదైనది.

Follow Us:
Download App:
  • android
  • ios