కారు బ్యాక్ వైపర్ ఎంత ముఖ్యమైనదో తెలుసా.. సెడాన్ కార్లలో ఈ ఫీచర్ ఎందుకు ఉండదంటే..?

సెడాన్‌ కార్లు కాకుండా  హ్యాచ్‌బ్యాక్‌లు, MUVలు అండ్ SUVల వంటి కార్లలో ఈ ఫీచర్‌ను అందించడానికి కంపెనీలకు గట్టి కారణం ఉంది. ఎందుకంటే సెడాన్‌లు మినహా అన్ని రకాల కార్లలో టెయిల్‌గేట్లు ఫ్లాట్‌గా ఉంటాయి.

How important rear wiper for car, know why this feature is not available in sedan cars?

మీ కారుకి వెనుక గ్లాస్ పై వైపర్లు  ఉన్నాయా..? అవును అయితే వాటి ఉపయోగం గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు కారు వెనుక గ్లాస్‌పై వచ్చే వైపర్  తో చాలా ఉపయోగాలు ఉన్నాయి.

కార్ బ్యాక్ వైపర్
కార్ వెనుక గ్లాస్‌పై ఉన్న దుమ్ము, ధూళి లేదా వర్షపు నీటిని తొలగించి గ్లాస్‌ను శుభ్రం చేయాల్సి వచ్చినప్పుడు వైపర్‌లు ఉపయోగపడతాయి. వైపర్లు సాధారణంగా కార్ల ముందు గ్లాస్ పై అందిస్తారు.
అయితే ప్రత్యేక డిజైన్లతో కూడిన కార్ బ్యాక్ వైపర్లు కూడా ఉంటాయి. కార్ కంపెనీలు హ్యాచ్‌బ్యాక్, ఎం‌యూ‌వి లేదా ఎస్‌యూ‌వి వంటి కార్లలో మాత్రమే ఈ ఫీచర్‌ను అందిస్తాయి. సెడాన్ కార్లకి బ్యాక్ వైపర్‌లు అందించవు.

కారణం ఏంటి
సెడాన్‌ కార్లు కాకుండా  హ్యాచ్‌బ్యాక్‌లు, MUVలు అండ్ SUVల వంటి కార్లలో ఈ ఫీచర్‌ను అందించడానికి కంపెనీలకు గట్టి కారణం ఉంది. ఎందుకంటే సెడాన్‌లు మినహా అన్ని రకాల కార్లలో టెయిల్‌గేట్లు ఫ్లాట్‌గా ఉంటాయి. దీంతో ఈ కార్ల వెనుక విండ్‌షీల్డ్‌కు గాలి తగలవు, ఈ కారణంగా వాటిపై ఉన్న దుమ్ము, ధూళి లేదా నీరు ఉండిపోతాయి.

బ్యాక్ వైపర్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందంటే 
మీకు హ్యాచ్‌బ్యాక్, MUV లేదా ఎస్‌యూ‌వి ఉంటే  ఆఫ్-రోడింగ్‌కు వెళ్ళినప్పుడు కార్ బ్యాక్ గ్లాస్ పై దుమ్ము, ధూళి లేదా బురద పడితే  ముందు గ్లాస్‌పై వైపర్‌ ద్వారా ఫ్రంట్ విండ్‌షీల్డ్‌ను ఎలా శుభ్రం చేస్తారో  బ్యాక్ గ్లాస్ పై కూడా అలాగే శుభ్రం చేయవచ్చు. ఒకవేళ ఇలా చేయకపోతే వెనుక చూడటం కష్టంగా మారుతుంది. ఇలాంటి సంధర్భంలో మీరు కారు నుండి దిగి విండ్‌షీల్డ్‌ను శుభ్రం చేయాల్సి ఉంటుంది.  

ఈ ఫీచర్ ప్రత్యేకం
కార్ల కంపెనీలు తక్కువ ధర ఉన్న కార్లలో ఎన్నో ఫీచర్లను ఇస్తున్న ఈ కాలంలో ఇలాంటి ఫీచర్ అందించడం లేదు. ఈ ఫీచర్ కొన్ని కార్లలో టాప్ వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios