Asianet News TeluguAsianet News Telugu

విపణిలోకి బీఎస్‌-6 హోండా యూనికార్న్‌.. ధరెంతంటే?!

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా బీఎస్‌-6 ప్రమాణాలు కల యూనికార్న్‌ బైక్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. 

Honda Unicorn BS-VI Launched in India at Rs 93,593
Author
New Delhi, First Published Feb 28, 2020, 2:57 PM IST


న్యూఢిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) బీఎస్‌-6 ప్రమాణాలు కల యూనికార్న్‌ బైక్‌ను దేశీయ విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను రూ.93,593గా నిర్ణయించింది. 

160సీసీ ఇంజిన్‌తో వస్తున్న కొత్త యూనికార్న్‌ బైక్ మెరుగైన పనితీరు కనబరుస్తుందని హోండా మోటారు సైకిల్స్ ఓ ప్రకటనలో తెలిపింది. 
హోండా తొలిసారి యూనికార్న్‌ను 16 ఏళ్ల క్రితం భారత్‌లో విడుదల చేసింది. 

అప్పటి నుంచి మెరుగైన పనితీరు కనబరుస్తూ ఆదరణకు నోచుకుందని హీరో హోండా మోటార్ సైకిల్స్ ప్రెసిడెంట్‌, సీఈవో, ఎండీ మినోరు కటో తెలిపారు. ఈ 16 ఏళ్లలో మొత్తం 25 లక్షల యూనిట్లను విక్రయించినట్లు పేర్కొన్నారు. 

కౌంటర్‌ వెయిట్‌ బ్యాలెన్సర్‌తో వస్తున్న ఈ కొత్త ఇంజిన్‌ బైక్‌ వైబ్రేషన్‌ తగ్గింస్తుంది. వేగాన్ని క్రమంగా పెంచేటప్పుడు సున్నితమైన పనితీరు కనబరుస్తుందని కంపెనీ  సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యద్వీందర్‌సింగ్‌ గులేరియా తెలిపారు.

నూతన సూపర్ స్ప్లెండర్ నూతన అడ్వాన్సుడ్ పీజీఎం-ఎఫ్ఐ హోండా ఎకో టెక్నాలజీ (హెట్)- 160 సీసీ ఇంజిన్ మరింత పవర్ వెలువరిస్తూ ట్రస్ట్ ఆఫ్ రిలయబిలిటీని బలోపేతం చేయనున్నది. 

Also read:ఇక స్విగ్గీ, జొమాటోలకు టఫ్ ఫైట్: ఫుడ్ డెలివరీలోకి అమెజాన్

బీఎస్-6 ప్రమాణాలతో రూపుదిద్దుకున్న హోండా యూనికార్న్ బైక్ బ్రేకింగ్ పెర్పార్మెన్స్ పెంపొందించబడిన ఏబీఎస్ సిస్టమ్, హెట్ ట్యూబ్ లెస్ టైర్, న్యూ టైర్ కాంపౌండ్ టెక్నాలజీ, హై పెర్ఫార్మెన్స్ రేర్ మోనో షాక్ సస్పెన్షన్ తదితర ఫీచర్లు కలిగి ఉన్నాయి. ఈ బైక్ ఎక్సలెంట్ స్టెబిలిటీతో సుపిరియర్ రైడింగ్ కంఫర్ట్‌గా ఉంది. హయ్యర్ ఫ్యూయల్ ఎఫెషియెన్సీ, గుడ్ లో ఎండ్ టార్చ్ డెలివరీ సామర్థ్యం ఈ బైక్ సొంతం. 

ఆరేళ్ల వారంటీ ప్యాకేజీ (మూడేళ్లు స్టాండర్ట్ ప్లస్ మూడేళ్లు ఆప్షనల్ ఎక్స్ టెండెడ్ వారంటీ) అందిస్తోంది. బీఎస్-6 ప్రమాణాలతో కూడిన యూనికార్న్ పెర్ల్ ఇగ్నీషియన్ బ్లాక్, ఇంపీరియల్ రేర్ మెటాలిక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ రంగుల్లో లభ్యం కానున్నది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios