న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) హర్యానాలోని మానేసర్‌లోని తన ప్లాంట్‌లో కార్యకలాపాలను నిరవధికంగా నిలిపివేసింది. ఆందోళన చేస్తున్న కార్మికులతో చర్చలు విఫలం కావడంతో సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది. 

సోమవారం నుండి ప్లాంట్ సాధారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు సంస్థ హెచ్ఎంఎస్ఐ నోటీసు జారీ చేసింది. యూనియన్ నాయకులు, ప్లాంట్ మేనేజ్‌మెంట్ మధ్య సోమవారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి.

aslo read  స్లైట్ జోష్! ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ దూకుడు

దీంతో శాశ్వత కార్మికులు, కార్మిక సంఘాలు, ఇతర  కాంట్రాక్ట్ సిబ్బంది దుష్ప్రవర్తనకు పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తూ  ఆరోపిస్తూ హెచ్ఎంఎస్ఐ ప్లాంట్ హెడ్ సైబల్ మైత్రా నోటీసులిచ్చారు. యూనియన్ నేతలు కాంట్రాక్టు కార్మికులను రెచ్చగొట్టి తమ అక్రమ సమ్మెను కొనసాగించమని పదేపదే కోరడంతోపాటు, కంపెనీ ప్రాంగణంలో చట్ట విరుద్ధ నిరసనలకు ప్రేరేపిస్తున్నారని ప్లాంట్ హెడ్ సైబల్ మైత్రా పేర్కొన్నారు. 

ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకుని, ప్లాంట్ సాధారణ కార్యకలాపాలు సాధ్యం కాదని భావించి నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి కార్య కలాపాలను ఎప్పుడు ప్రారంభించేదీ హోండా మోటార్స్ అండ్ స్కూటర్స్ వెల్లడించలేదు. 

ప్లాంట్‌లోని పరిస్థితి సాధారణమైన తర్వాత కార్యకలాపాల పునఃప్రారంభంపై వాటాదారులకు సమాచారం ఇస్తామని తెలిపింది. కాగా ఉత్పత్తి కోత, కాంట్రాక్టు ఉద్యోగులపై భారీగా తొలగించడాన్ని నిరసిస్తూ ఈ నెల ఐదో తేదీ నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. 

aslo read మార్కెట్‌లోకి యమహా బీఎస్-6 బైక్‌లు.. ధర ఎంతంటే!

అలాగే  తమకు జీతాలు పెంచాలని కూడా పర్మినెంట్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.  వీరి ఆందోళనకు రాజకీయ పార్టీలు, ఇతర యూనియన్లు వారికి మద్దతు ఇస్తున్నాయి. రోజుకు ప్లాంట్లో ఉత్పత్తి  చేసే ద్విచక్ర వాహనాల సంఖ్య 6,000 నుండి నవంబర్ నాటికి 3,500 వాహనాలకు తగ్గించారని ప్లాంట్ కార్మిక సంఘం సెక్రటరీ జనరల్ రమేష్ ప్రధాన్ పేర్కొన్నారు.

దీంతో 2019 ప్రారంభం నుండి మొత్తం 1,000 మంది ఉపాధి కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం, ప్రతి మూడేళ్లకోసారి పే స్కేల్ సవరించాల్సి ఉందన్నారు. కానీ 2018 ఆగస్టు నుంచి వేతన సవరణ పెండింగ్ లో ఉన్నదని కార్మికులు చెబుతున్నారు.