న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ‘హోండా కార్స్ ఇండియా’ విపణిలోకి బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన సెడాన్ మోడల్ కారు ‘సిటీ’ని విడుదల చేసింది. దీని ధర రూ.9.91 లక్షల నుంచి మొదలై రూ.14.31 లక్షల వరకు పలుకుతుంది. హోండా సిటీ కారు పెట్రోల్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లలో లభించనున్నది. 

త్వరలో డీజిల్ వెర్షన్ కూడా తీసుకొస్తామని హోండా కార్స్ ఇండియా తెలిపింది. మిడ్ సైజ్ సెడాన్ కారు సిటీ.. ప్రత్యర్థి సంస్థలైన మారుతి సుజుకి సియాజ్, హ్యుండాయ్ వెర్నా, వోక్స్ వ్యాగన్ వెంటో, స్కోడా వారి రాపిడ్ మోడల్ కార్లకు గట్టి పోటీ ఇవ్వనున్నది.

also read  పండుగ సీజన్ లో కాస్త ఊరించిన...మళ్ళీ పడిపోయాయిన ఆటో సేల్స్..

హోండా సిటీ వీ, వీఎక్స్, జడ్ఎక్స్ వేరియంట్ కార్లలో అధునాతన ఇన్ఫోటైన్మెంట్ వ్యవస్థ డిజిపాడ్ 2.0ను ప్రవేశపెట్టింది. 17.7 సెంటిమీటర్ల టచ్ స్క్రీన్ ఆడియో, వీడియో నేవిగేషన్ వ్యవస్థ, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలతో పని చేసే స్మార్ట్ ఫోన్ లింకేజీ ఈ కారులో అమర్చిన ఫీచర్ల ప్రత్యేకతలు.

న్యూ సిటీ బీఎస్-6 కారు 1.5 లీటర్ల సామర్థ్యంతో 4-సిలిండర్లతో వాటర్ కూల్డ్, ఎస్వోహెచ్సీ, ఐ-విటెక్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 119 పీఎస్, 145 ఎన్ఎం పీక్ టార్చినిస్తుంది. 5 -స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ గల సీవీటీ ఆప్షన్‌ కారులో 7-స్పీడ్ పెడల్ షిప్టర్ కలిగి ఉంది. సిటీ, సీవీటీ వేరియంట్ కార్లు 17.4, 18 కి.మీ. మైలేజీనిస్తాయి. 

హోండా సిటీ కారు డీజిల్ ఇంజిన్ ఆప్షన్ లోనూ లభిస్తుంది. 1.5 లీటర్లు, 4- సిలిండర్, వాటర్ కూల్డ్, డీవోహెచ్సీ, ఐ-డీటెక్ మోటార్ 100 పీఎస్, 200 ఎన్ఎం టార్చిని విడుదల చేసింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్సిమిషన్, 25 కి.మీ. మైలేజీనిస్తుంది. 

also read  తెలంగాణలో కొత్త ఈ-టాక్సీ సేవలు...పర్యావరణానికే ప్రియారిటీ

హోండా సిటీ కారులో హానీ కాంబ్ గ్రిల్లె, ఎల్ఈడీ డీఆర్ఎల్స్ విత్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ ఫాగ్ లైట్స్, ఎల్ఈడీ రేర్ కాంబినేషన్ ల్యాంప్స్, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ ఆంటీనా, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు చేర్చారు. 3-రింగ్ 3డీ కాంబీ మీటర్ అండ్ క్రూయిజ్ కంట్రోల్ కలిగి ఉన్నాయి. 

హోండా సిటీ నాలుగు వేరియంట్లలో ఎస్వీ, వీ, వీఎక్స్, జడ్ ఎక్స్ మోడళ్లలో లభించనున్నది. పెట్రోల్ వర్షన్‌లో సిటీ ఎస్వీ ఎంటీ కారు రూ.9.91 లక్షలకు, సిటీ వీ ఎంటీ రూ.10.66 లక్షలకు, సిటీ వీఎక్స్ ఎంటీ రూ.11.82 లక్షలకు, సిటీ జడ్ఎక్స్ ఎంటీ రూ.13.01 లక్షలకు, సిటీ వీ సీవీటీ రూ.12.01 లక్షలకు, సిటీ వీఎక్స్ సీవీటీ రూ.13.12 లక్షలకు, సిటీ జడ్ ఎక్స్ సీవీటీ రూ.14.31 లక్షలకు లభిస్తాయి.