ఇండియాలోకి హోండా కొత్త బైక్.. మొదలైన బుకింగ్స్.. మార్చిలో అందుబాటులోకి...
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా మిడ్ సైజెడ్ మేడ్ ఇన్ ఇండియా బైక్ హోండా సిబి 350 ఆర్‌ఎస్ 2021 లాంచ్ చేసింది. కొన్ని నివేదికల ప్రకారం ఈ బైక్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
జపాన్ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా మిడ్ సైజెడ్ మేడ్ ఇన్ ఇండియా బైక్ హోండా సిబి 350 ఆర్‌ఎస్ 2021 లాంచ్ చేసింది. కొన్ని నివేదికల ప్రకారం ఈ బైక్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి అలాగే వచ్చే నెల నుండి భారతదేశంలో అందుబాటులో ఉంటుంది.
గత ఏడాది అక్టోబర్‌లో సిబి 350 బైక్‌ను ప్రవేశపెట్టిన తర్వాత సిబి 350 ఆర్‌ఎస్ హోండాకు మోటారు సైకిళ్ల రెండవ ఉత్పత్తి, ఇది 'మేడ్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్' బైక్. సిబి 350 ఆర్‌ఎస్ 2021 ధర రూ .1.96 లక్షలు.
హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) అట్సుషి ఒగాటా వర్చువల్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ "గత ఏడాది భారత వాహన తయారీదారులు 'మేడ్ ఇన్ ఇండియా' సిబి బ్రాండ్‌ను ఎక్స్పెరిఎన్స్ చేశారని, వారి రైడింగ్ అనుభవం పెంచే అవకాశం ఇప్పుడు మళ్ళీ లభించింది.
ఈ రోజు హోండా సిబి సిరీస్‌లో మరో బైక్ తీసుకురావడం మేము సంతోషిస్తున్నాము. సిబి బ్రాండ్ నిజమైన వారసత్వాన్ని చూపిస్తూ సిబి 350 ఆర్ఎస్ స్టయిల్, ఎక్స్పెరిఎన్స్ అందించడం ద్వారా భారతీయ వినియోగదారుల విలువను మరింత పెంచుతుందని ఆయన అన్నారు.
also read మీరు కొత్త కారు లేదా బైక్ కొనాలని ఆలోచిస్తున్నారా.. అయితే వెంటనే నిర్ణయించుకోండి లేదంటే ? ...
ఎగుమతి పై ప్రణాళిక
ఈ బైక్ పనితీరు, సౌకర్యం, స్టయిల్, టెక్నాలజి ఒక అందమైన కలయిక అని ఆయన అన్నారు. అలాగే హోండా సిబి 350 ఆర్‌ఎస్‌ను విదేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ యోచిస్తుందా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా హెచ్‌ఎంఎస్‌ఐ జపాన్‌లోని ప్రధాన కార్యాలయంతో చర్చించి సిబి 350, సిబి 350 ఆర్‌ఎస్ బైక్‌లపై ఆసక్తి ఉన్న మార్కెట్లను కనుగొంటుందని చెప్పారు.
అయితే ఈ రెండు బైక్‌లతో హెచ్‌ఎంఎస్‌ఐ ప్రాధాన్యత భారత మార్కెట్‌గా ఉంటుందని ఆయన అన్నారు. హెచ్‌ఎంఎస్‌ఐ డైరెక్టర్ - సేల్స్ అండ్ మార్కెటింగ్ యాద్విందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ మార్చి నాటికి 50 సేల్స్ సెంటర్లను చేరుకునేందుకు కంపెనీ పయనిస్తోంది. ఈ నెలాఖరులోగా కంపెనీకి 35 సేల్స్ సెంటర్లు సిద్ధంగా ఉంటాయని చెప్పారు. 2021 సంవత్సరం వ్యాపారం గురించి అడిగినప్పుడు ఓగాటా స్పందిస్తూ ఈ సంవత్సరం ఇప్పుడే ప్రారంభమైంది, ఇప్పటివరకు గత సంవత్సరంతో పోలిస్తే మెరుగ్గా ఉంది, అయితే డిమాండ్‌ను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ బైక్ సుమారు 5500 ఆర్‌పీఎం వద్ద 1.5 కిలోవాట్ల సామర్థ్యాన్ని ఉత్పత్తి చేసే 350 సీసీ ఇంజిన్ ఇందులో అమర్చారు. స్లిప్, అసిస్ట్ క్లచ్ సదుపాయాలతో 5 స్పీడ్ గేర్ బాక్స్ అందించారు. సెలక్టబుల్ టార్క్ కంట్రోల్, యాంటీ–లాక్ బ్రేకింగ్ వ్యవస్థలతో పాటు డిజిటల్ అనలాగ్ మీటర్ దీనిలో ఉంది. హోండా కంపెనీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ‘సీబీ’ బ్రాండ్ వారసత్వాన్ని ఈ కొత్త సీబీ350ఆర్‌ఎస్ నిలుపుతుందనే ఆశాభావాన్ని హోండా మోటార్స్, స్కూటర్ ఇండియా ఎండీ అత్సుషీ ఒగాటా వ్యక్తం చేశారు.