Asianet News TeluguAsianet News Telugu

హోండా యాక్టివా 7జి.. కొత్త అప్‌డెటెడ్ ఇంజన్ తో ఎలాంటి లేటెస్ట్ ఫీచర్స్ చూడొచ్చంటే..?

మీడియా నివేదికల ప్రకారం, యాక్టివా  కొత్త వెర్షన్‌ను హోండా త్వరలోనే తీసుకురావచ్చు. యాక్టివా 7జీని భారత్‌లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ ఇందుకు సన్నాహాలు కూడా చేస్తోంది. 

Honda can bring Activa 7G soon it will get big updates, engine will also change
Author
First Published Nov 28, 2022, 11:52 AM IST

జపనీస్ కార్ కంపెనీ హోండా త్వరలో కొత్త యాక్టివాని భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ప్రస్తుత వెర్షన్‌తో పోలిస్తే Activa 7Gలో చాలా పెద్ద మార్పులు చూడవచ్చు. కొత్త హోండా యాక్టివా 7జీలో కంపెనీ ఎలాంటి పెద్ద మార్పులు చేయనుందంటే...

ఇంజన్‌లో మార్పు వస్తుందా?
మీడియా నివేదికల ప్రకారం, యాక్టివా  కొత్త వెర్షన్‌ను హోండా త్వరలోనే తీసుకురావచ్చు. యాక్టివా 7జీని భారత్‌లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ ఇందుకు సన్నాహాలు కూడా చేస్తోంది. ఇందులో అతిపెద్ద మార్పు ఇంజిన్‌లో ఉంటుంది. నివేదికల ప్రకారం, పెట్రోల్ ఇంజిన్‌తో కంపెనీ 7G యాక్టివాలో హైబ్రిడ్ ఇంజిన్‌  అందించవచ్చు. ఈ ఇంజన్ 109 సిసి హైబ్రిడ్ ఇంజన్ అవవచ్చు.

ఆవరేజ్ మైలేజ్ ?
కొత్త యాక్టివా 7Gలో కంపెనీ హైబ్రిడ్ ఇంజన్ ఇస్తే, ఖచ్చితంగా స్కూటర్ యావరేజ్ మైలేజ్ కాస్త ఎక్కువగా ఉంటుంది. హైబ్రిడ్‌తో పాటు, కంపెనీ కొత్త యాక్టివాలో ఐడిల్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీని కూడా అందించవచ్చు. అంటే స్కూటర్ కొద్దిసేపు ఆన్ చేసి ఉంటే ఆగిపోతుంది, క్లచ్ నొక్కిన వెంటనే స్టార్ట్ అవుతుంది. దీని ద్వారా ఆవరేజ్ మైలేజ్ కూడా మెరుగుపరుస్తుంది.

వెడల్పు టైర్లు 
రిపోర్టుల ప్రకారం, యాక్టివా 7Gలో ఇప్పటికే ఉన్న టైర్ల కంటే కంపెనీ కాస్త పెద్ద టైర్లను ఇవ్వవచ్చు. పెద్ద వీల్స్, వేడల్పైన టైర్లు స్కూటర్ హ్యాండ్లింగ్ చాలా మెరుగుపరుస్తుంది.

కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ 

నివేదికల ప్రకారం, Activa 7Gలో కొత్త అండ్ మెరుగైన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇవ్వవచ్చు. ప్రస్తుత యాక్టివా అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. కానీ కొత్త యాక్టివాలో కంపెనీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఇవ్వవచ్చు. దీని వల్ల మెరుగ్గా కనిపించడమే కాకుండా ఇతర కంపెనీల స్కూటర్ల లాగానే యాక్టివా కూడా అప్‌డేట్ అవుతుంది. అంతేకాకుండా, కంపెనీ బ్లూటూత్ కనెక్టివిటీ, హైబ్రిడ్ స్విచ్ వంటి ఎన్నో ఇతర ఫీచర్లను కూడా అందించవచ్చు.

డిజైన్‌లో మార్పు ?

రిపోర్టుల ప్రకారం, కంపెనీ యాక్టివా డిజైన్‌లో పెద్దగా మార్పులు ఉండవు. సాధారణంగా, యాక్టివా స్టాండర్డ్ డిజైన్‌లో కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి మార్పు చేయలేదు. ఫస్ట్ జనరేషన్ యాక్టివా నుండి ప్రస్తుత యాక్టివా వరకు డిజైన్ దాదాపు ఒకే విధంగా ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios