Honda Activa:హోండా ఆక్టివా 6G, ఆక్టివా 125 స్కూటర్ల ధర పెంపు.. ఒక్కో వేరియంట్ కొత్త ధర ఎంత పెరిగిందంటే..

ఈ రెండు మోడళ్ల ధరల్లో స్వల్ప పెరుగుదల ఉండగా, ఫీచర్లు ఇంకా స్పెసిఫికేషన్‌లతో సహా  ఎటువంటి మార్పు లేదు. ఆక్టివా  6G ప్రస్తుతం ఆరు కలర్స్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. 

Honda Activa 6G and Activa 125 scooters become expensive, know the new price of each variant


హోండా 2 వీలర్ ఇండియా (honda2wheeler india) పాపులర్ స్కూటర్ ఆక్టివా  6జి (Activa 6G), ఆక్టివా 125 (Activa 125)  ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు ఈ రెండు స్కూటర్లు రూ.500 నుంచి రూ.1,000 వరకు ఖరీదు అయ్యాయి. తాజా ధరల పెంపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. హోండా ఆక్టివా 6G ధర ఇప్పుడు రూ.71,432 నుండి ప్రారంభమవుతుంది. అయితే హోండా ఆక్టివా  125 ధర మాత్రం రూ.74,989 నుంచి ప్రారంభమవుతుంది. ధరల పెంపు మినహా స్కూటర్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. 

ఢిల్లీ ఎక్స్-షోరూమ్‌లో ఆక్టివా  6G, ఆక్టివా  125 కొత్త ధరలు
 
ఆక్టివా  వేరియంట్‌లు                          కొత్త ధర (రూ.)    పాత ధర (రూ.)
ఆక్టివా  6G స్టాండర్డ్                                 71,432               70,599
ఆక్టివా  6G డీలక్స్                                  73,177                72,345
ఆక్టివా  125 డ్రమ్‌                                   74,898                74,157
ఆక్టివా  125 డ్రమ్ అలయ్                      78,657               77,725
ఆక్టివా  125 డిస్క్                                  82,162                 81,280
ఆక్టివా  125 లిమిటెడ్ ఎడిషన్ డ్రమ్     79,657                 78,725
ఆక్టివా  125 లిమిటెడ్ ఎడిషన్ డిస్క్     83,162                82,280

ఈ రెండు మోడళ్ల ధరల్లో స్వల్ప పెరుగుదల ఉండగా, ఫీచర్లు ఇంకా స్పెసిఫికేషన్‌లతో సహా  ఎటువంటి మార్పు లేదు. ఆక్టివా  6G ప్రస్తుతం ఆరు కలర్స్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఆక్టివా  125లో ఐదు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆక్టివా  లిమిటెడ్ ఎడిషన్ మోడల్ కూడా రెండు కలర్స్ లో వస్తుంది. 

ఆక్టివా  125 స్కూటర్  124సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 6,500rpm వద్ద 8.18bhp శక్తిని, 5,000rpm వద్ద 10.3Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా భారత మార్కెట్లో సుజుకి యాక్సెస్ 125 అండ్ టి‌వి‌ఎస్ జూపిటర్ 125 వంటి స్కూటర్లతో పోటీపడుతుంది. 

ఆక్టివా  6G 109cc సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను పొందుతుంది. హోండా  ఆక్టివా  దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల బ్రాండ్‌లలో ఒకటి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios