ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా  మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త మోడల్ బైక్ ని భారత మార్కెట్ లోకి విడుదల చేసింది. అత్యంత చవక ధరతో మధ్య తరగతి ప్రజలనే టార్గెట్ చేస్తూ 'హోండా సిడి 110 డ్రీమ్' ను విడుదల చేసింది. ఈ బైక్ ను కేవలం రూ.41,100(ఎక్స్ షోరూం డిల్లీ) ధరకే వినియోగదారులకు అందుబాటులో ఉంచినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

జపాన్‌‌కు చెందిన హోండా సంస్థ టెక్నాలజీ పరంగా అద్బుతమైన సదుపాయాలను ఈ  'హోండా సిడి 110 డ్రీమ్' లో అందించింది. దీనిలో 110సీసీ సామర్థ్యం గల ఇంజన్‌ ఉపయోగించారు. అలాగే దీన్ని ఈకో టెక్నాలజీ (హెచ్ఈటి)తో అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ వల్ల ఇంజన్ పవర్ తగ్గకుండానే మెరుగైన మైలేజీని పొందటం సాధ్యమవుతుంది. దీంతో ఈ బైక్ లీటర్ పెట్రోల్ కు 74 కిలోమీటర్ల మైలేజి ఇస్తుంది. 

ఇక ఈ మోడల్ లుక్ విషయానికి వస్తే పెట్రోల్ ట్యాంక్‌పై సింపుల్ గ్రాఫిక్స్, బ్లాక్ కలర్ ఇంజన్, సిల్వర్ కోటెడ్ ఇంజన్ స్లీవ్స్, సిల్వర్ కలర్ అల్లాయ్ వీల్స్, మెయింటినెన్స్ ఫ్రీ బ్యాటరీ, ట్యూబ్‌లెస్ టైర్స్, డ్రమ్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.సీటును కూడా వెడల్పు, పొడవుగా డిజైన్ చేయడంతో సుధీర్ఘ ప్రయాణాల్లో సైతం సౌకర్యంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. 
 
ఈ మోడల్ అన్ని హోండా డీలర్ షిప్ షోరూంలలోను లభించనుంది.  బ్లాక్ విత్ రెడ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్ వంటి మూడు ఆకర్షనీయమైన రంగులలో అందుబాటులో ఉంది.