Asianet News TeluguAsianet News Telugu

యూత్ కోసం మళ్ళీ హీరో పెర్ఫార్మెన్స్ బైక్ రిలాంచ్.. పవర్ ఫుల్ ఇంజన్‌తో లాంచ్ ఎప్పుడంటే..?

పెర్ఫార్మెన్స్ బైక్ కరిజ్మాను హీరో మోటోకార్ప్ భారత మార్కెట్లో మరోసారి రిలాంచ్ చేయవచ్చు. మీడియా కథనాల ప్రకారం, కొత్త కరిజ్మాలో కంపెనీ కొత్త డిజైన్‌ను ఇవ్వనుంది అలాగే పాత మోడల్ కంటే మెరుగైన ఇంజన్‌ను ఇందులో ఉపయోగించుకోవచ్చు.  
 

Heros performance bike Karizma will come back with a powerful engine, know when it will be launched-sak
Author
First Published Mar 24, 2023, 6:48 PM IST

భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కరిజ్మాను భారతదేశంలో పర్ఫర్మెంస్ బైక్ విభాగంలో మరోసారి రిలాంచ్ చేయవచ్చు. మీడియా కథనాల ప్రకారం, కరిజ్మా బైక్‌ను రీలాంచ్ చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. కంపెనీ ఈ బైక్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తుందో,  ఎలాంటి మార్పులు చేయవచ్చో  తెలుసుకుందాం...

కొత్త లుక్ లో కరిజ్మా 
భారతదేశంలో కరిజ్మా బైక్ మరోసారి లాంచ్ కావొచ్చు. కొత్త కరిజ్మాలో కంపెనీ కొత్త డిజైన్‌ను ఇవ్వనుంది అలాగే పాత మోడల్ కంటే మెరుగైన ఇంజన్‌ను ఇందులో ఉపయోగించుకోవచ్చు. అయితే, ఇప్పటివరకు కొత్త కరిజ్మా గురించి కంపెనీ ఎటువంటి అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు.

డిజైన్ ఎలా ఉంటుందంటే
ఈ బైక్‌ను కొత్త ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించవచ్చు. అంతేకాకుండా, దీనికి మరింత డైనమిక్ అండ్ స్పోర్టీ లుక్ ఇవ్వవచ్చు. ఫుల్ ఫెయిర్డ్ బైక్‌గా గుర్తింపు తెచ్చుకున్న కరిజ్మాను కొత్త లుక్ లో ఫెయిర్డ్ బైక్‌గా మాత్రమే తీసుకురావచ్చు.

 పవర్ ఫుల్ ఇంజిన్
ఈ బైక్ లో 210 సిసి లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందించవచ్చు. దీనితో 6-స్పీడ్ గేర్ ట్రాన్స్‌మిషన్ ఇవ్వనుంది. ఈ ఇంజన్‌తో బైక్ 25 బిహెచ్‌పి పవర్, 30 న్యూటన్ మీటర్ల టార్క్‌ను పొందుతుంది.

ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటే  
ఈ బైక్ లో ఎన్నో ప్రత్యేక ఫీచర్లను అందించవచ్చు. ఇంకా డ్యూయల్ ఛానల్ ABS, రెండు వీల్స్ కి డిస్క్ బ్రేక్‌లు, ఫుల్ డిజిటల్ స్పీడోమీటర్, USD ఫోర్క్స్, LED లైట్లు, LED టర్న్ ఇండికేటర్లు, LED DRLలు, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు చూడవచ్చు.

లాంచ్ అండ్ ధర 
ఈ కరిజ్మా బైక్ 2023 సంవత్సరం చివరి నాటికి ప్రవేశపెట్టవచ్చు. ఈ బైక్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం అధికారికంగా ఇవ్వలేదు, అయితే మీడియా నివేదికల ప్రకారం, దీని ధర కూడా రూ. 1.50 లక్షల నుండి రూ. 2 లక్షల వరకు ఉండవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios