హీరో స్ప్లెండర్ స్వల్ప ధరల పెంపుతో పాటు, కంపెనీ లైనప్ నుండి గతంలో విక్రయించిన కొన్ని వేరియంట్‌లను కూడా నిలిపివేసింది . హీరో సూపర్ స్ప్లెండర్  పాత వెర్షన్,  బైక్  100 మిలియన్ల ఎడిషన్‌ను నిలిపివేసింది. 

హీరో మోటోకార్ప్ (hero motorcorp) పాపులర్ స్ప్లెండర్ (splendor) సిరీస్ బైక్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. స్ప్లెండర్ సిరీస్ ధర ఇప్పుడు రూ. 500 నుండి రూ. 1,000 వరకు పెరిగింది. ధరల పెంపు మినహా బైక్ లో ఎలాంటి మార్పులు చేయలేదు. స్ప్లెండర్ కాకుండా, హీరో మోటోకార్ప్ ఇతర బైక్స్ కూడా ఖరీదైనవిగా మారాయి. 

స్ప్లెండర్ సిరీస్ బైకుల కొత్త ఎక్స్-షోరూమ్ ధరల జాబితా 

వెరియంట్స్ కొత్త ధర పాత ధర
స్ప్లెండర్ ప్లస్ 69,380 68,590
స్ప్లెండర్ ప్లస్ i3S 70,700 69,790
స్ప్లెండర్ ప్లస్ i3S మాట్ షీల్డ్ గోల్డ్ 71,700 70,790 
2022 సూపర్ స్ప్లెండర్ డ్రమ్ 75,700 74,700
2022 సూపర్ స్ప్లెండర్ డిస్క్ 79,600 78,600

హీరో స్ప్లెండర్ స్వల్ప ధరల పెంపుతో పాటు, కంపెనీ లైనప్ నుండి గతంలో విక్రయించిన కొన్ని వేరియంట్‌లను కూడా నిలిపివేసింది . హీరో సూపర్ స్ప్లెండర్ పాత వెర్షన్, బైక్ 100 మిలియన్ల ఎడిషన్‌ను నిలిపివేసింది.

ఇంజిన్ అండ్ పవర్
హీరో సూపర్‌స్ప్లెండర్ కమ్యూటర్ బైక్ BS6 స్టాండర్డ్ 124.7cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ పొందుతుంది. ఈ ఇంజన్ 10.72 బిహెచ్‌పి పవర్, 10.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, స్ప్లెండర్ ప్లస్ 97.2cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది, ఈ బైక్ 8,000 rpm వద్ద 7.91 bhp శక్తిని, 6,000 rpm వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 

ఇదిలా ఉండగా మార్చి 2022లో 4,50,154 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. స్ప్లెండర్ మేకర్ గత నెలలో దేశీయ మార్కెట్లో 4,15,764 ద్విచక్ర వాహనాలను విక్రయించగా, అంతర్జాతీయ మార్కెట్లలో 34,390 యూనిట్లు ఎగుమతి అయ్యాయి. ఫిబ్రవరి 2022లో 3,58,254 బైక్స్, స్కూటర్లను విక్రయించినందున గత నెలలో విక్రయించిన యూనిట్ల కంటే ఇది వరుస పెరుగుదల అని కంపెనీ తెలిపింది.