Hero MotoCorp Vida:లాంచ్‌కు ముందే హీరో మోటోకార్ప్ కొత్త ఈవి బ్రాండ్ ఆవిష్కరణ, ఈ నెల చివరిలో లాంచ్..
హీరో మోటోకార్ప్ సోషల్ మీడియా హ్యాండిల్‌లో విడా బ్రాండింగ్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేసింది. కంపెనీ చైర్మన్ అండ్ సీఈఓ పవన్ ముంజాల్ బ్రాండింగ్ పక్కన పోజులిస్తు ఉండటం చూడవచ్చు.
భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ కొత్త అండ్ రానున్న ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ విడా (vida) లోగోను ఆవిష్కరించింది. కొత్త బ్రాండింగ్ ఎలా ఉంటుందో కంపెనీ షేర్ చేసింది. విడా మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఈ నెలాఖరులో భారతదేశంలో ప్రారంభించనుంది.
కొత్త పేరు కోసం అన్వేషణలో
హీరో ఎలక్ట్రిక్ బ్రాండ్ ఉనికి కారణంగా హీరో మోటార్ కార్ప్ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం కొత్త బ్రాండింగ్ అవసరం. కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలకు 'హీరో' బ్రాండింగ్‌ను ఉపయోగించడంపై హీరో ఎలక్ట్రిక్‌తో న్యాయ పోరాటం చేస్తోంది. హీరో మోటార్ కార్ప్ కొంతకాలంగా ఎలక్ట్రిక్ వాహన వ్యాపారానికి ప్రాతినిధ్యం వహించడానికి కొత్త పేరును కనుగొనడానికి ప్రయత్నిస్తోంది.
హీరో మోటోకార్ప్ సోషల్ మీడియా హ్యాండిల్‌లో విడా బ్రాండింగ్ ఫస్ట్ లుక్‌ను షేర్ చేసింది. కంపెనీ చైర్మన్ అండ్ సీఈఓ పవన్ ముంజాల్ బ్రాండింగ్ పక్కన పోజులిస్తు ఉండటం చూడవచ్చు.
త్వరలో విడుదల
హీరో మోటోకార్ప్ ఈ నెల చివరిలో మొదటి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని పరిచయం చేయనున్నట్లు గతంలో ప్రకటించింది. హీరో 10వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా గత ఏడాది ఆగస్టులో రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది.
ధర అండ్ పోటీ
భారత మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ TVS iQube, Bajaj Chetak, Ola S1 వంటి ఇతర వాహనాలతో పోటీపడుతుంది. ఆటోమొబైల్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు తయారీ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయనుంది. హీరో ప్రత్యర్థులతో పోటీ పడేందుకు స్కూటర్ల ధరలను కూడా పోటీగా ఉంచవచ్చు. నివేదిక ప్రకారం, హీరో మోటోకార్ప్ రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను రూ. 1 లక్ష కంటే తక్కువగా ఉంచవచ్చు.
గొగోరో
హీరో మోటోకార్ప్‌తో బ్యాటరీ మార్పిడి టెక్నాలజి కోసం తైవాన్ కంపెనీ గొగోరో (gogoro)తో ఒప్పందం కుదుర్చుకుంది. కంపెనీ ప్రీమియం ఉత్పత్తులను విస్తృత శ్రేణిలో విడుదల చేయడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాటిలో కంపెనీ బ్యాటరీతో నడిచే బైక్ పై కూడా పనిచేస్తోందని సమాచారం.