‘హీరో’ఫస్ట్: నవంబర్ సేల్స్‌లో టాప్ 4 మోడల్స్ ఆ సంస్థవే

హీరో మోటో కార్ప్ సంస్థ మళ్లీ తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకున్నది. నవంబర్ నెల విక్రయాల్లో టాప్ -4 మోడల్ బైక్‌లు ఈ సంస్థవే. తర్వాతీ స్థానాల్లో హోండా, బజాజ్, టీవీఎస్ నిలిచాయి.
 

Hero MotoCorp tops best selling two-wheeler list in Nov; 4 models in top 10

దేశీయ ద్విచక్రవాహనాల విక్రయాల్లో ‘హీరో మోటోకార్ప్‌’ తన స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకున్నది. హీరోతో పాటు హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా(హెచ్‌ఎంఎస్‌ఐ), బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీలు కూడా అమ్మకాల్లో అభివృద్ధిని కనబరిచాయి. నవంబర్ నెలలో అత్యధిక అమ్మకాలతో దుమ్మురేపింది. 

తొలి 10 మోడల్ మోటారు సైకిళ్ల విక్రయాలో ఈ కంపెనీవే నాలుగు బైక్‌లు ఉన్నాయి. ఇక హోండా మోటార్‌సైకిల్‌, బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌ సంస్థలకు చెందిన రెండు మోడల్ బైక్‌లు చోటు దక్కించుకున్నాయి. 

హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌, టీవీఎస్‌ మోటార్‌ ఎక్స్‌ఎల్‌ సూపర్‌ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. హీరో ప్యాషన్‌కు ఐదో స్థానం దక్కింది. హోండా సీబీ షైన్‌, బజాజ్‌ పల్సర్‌, టీవీఎస్‌ జూపిటర్‌, హీరో గ్లామర్‌ మోడళ్లు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బజాజ్‌ ప్లాటినా 10వ స్థానం పొందింది.

గతేడాది నవంబర్‌లో జరిగిన 2,25,737 అమ్మకాలతో పోలిస్తే కాస్త తగ్గి 2,25,536 వాహనాలు విక్రయమయ్యాయి. ఆ తర్వాత 2,18,212 యూనిట్లతో హోండా యాక్టివా రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే సమయంలో 2,26,046 యూనిట్లు అమ్ముడుపోవడం గమనార్హం. 

1,68,839 యూనిట్లతో హీరోకు చెందిన హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌ మూడో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో టీవీఎస్‌ మోటార్స్‌కు చెందిన ఎక్స్‌ఎల్‌ సూపర్‌ మోపెడ్‌ ఉంది. 2017లో 69,888 యూనిట్లు అమ్ముడుపోయిన ఎక్స్‌ఎల్‌ ఈసారి వృద్ధిని నమోదు చేసి ఏకంగా 74,590 వాహనాలను విక్రయించింది.

హీరోమోటోకార్ప్‌కు చెందిన ప్యాషన్‌ బైక్‌ 74,396 యూనిట్లతో ఐదో స్థానంలో నిలవగా, ఆ తర్వాత హోండా సీబీ షైన్‌(70,803) బజాజ్‌ పల్సర్‌(69,579) టీవీఎస్‌ జూపిటర్‌(69,391), హీరో గ్లామర్‌(63,416), బజాజ్‌ ప్లాటినా (62,555) టాప్‌-10లో ఉన్నాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios