హ్యుందాయ్ కొత్త మైక్రో ఎస్‌యూ‌వి.. టాటా, మారుతి కార్లకు పోటీగా లాంచ్.. ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే..

ఈ ఎస్‌యూ‌వి ధర అండ్ ఫీచర్స్ పరంగా కొత్త హ్యుందాయ్ మైక్రో SUV టాటా పంచ్ ఇంకా రాబోయే మారుతి ఫ్రాంక్స్‌తో పోటీపడుతుంది.

Here comes the new Hyundai micro SUV will compete against the Tata Punch and the upcoming Maruti Fronx-sak

సౌత్ కొరియన్ కంపెనీ హ్యుందాయ్ నుండి  రానున్న మైక్రో-SUV AI3 అనే కోడ్‌నేమ్ తో ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. అయితే ఈ ఎస్‌యూ‌వి టెస్ట్ సమయంలో కెమెరాకి చిక్కింది, ఫోటోల ద్వారా కొన్ని అద్భుతమైన డిజైన్ వివరాలను వెల్లడిస్తున్నాయి. ధర అండ్ ఫీచర్స్ పరంగా కొత్త హ్యుందాయ్ మైక్రో SUV టాటా పంచ్ ఇంకా రాబోయే మారుతి ఫ్రాంక్స్‌తో పోటీపడుతుంది. ఈ కార్  గ్లోబల్ మార్కెట్లలో విక్రయించే హ్యుందాయ్ క్యాస్పర్‌ని పోలి ఉండవచ్చు. కానీ కొంచెం పొడవుగా ఉంటుంది. 

లేటెస్ట్ స్పై షాట్‌లో కొత్త హ్యుందాయ్ మైక్రో SUV సన్‌రూఫ్‌తో గుర్తించబడింది. అయితే హై ట్రిమ్‌ల కోసం దీనిని రిజర్వ్ చేయవచ్చని ఆశించవచ్చు. సిగ్నేచర్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, H-ఆకారపు లైట్ ఎలిమెంట్‌తో కూడిన టెయిల్‌ల్యాంప్‌లు, గూండ్రటి ఫాగ్ ల్యాంప్స్, LED DLR, అల్లాయ్ వీల్స్ ఫ్రంట్ ఎండ్‌ను ఆకర్షణీయంగా చేస్తాయి. ప్రస్తుతం, ఈ మినీ SUV  ఇంటర్నల్ వివరాలు అందుబాటులో లేవు.  

ఫీచర్ లిస్ట్‌లో Apple CarPlay, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్ట్ కార్ టెక్, బ్యాక్ AC వెంట్‌లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇంకా మరిన్ని ఉండవచ్చు. 

రాబోయే మైక్రో SUV గురించి కార్ల తయారీ కంపెనీ ఇంకా ఏమీ వెల్లడించలేదు. అయితే, 83bhp పవర్, 113.8Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2L పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుంది. అదే పవర్‌ట్రెయిన్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్‌లో కూడా చూడవచ్చు. ఈ మినీ SUV మాన్యువల్ ఇంకా ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో వస్తుంది. CNG ఆప్షన్ కూడా ఉండవచ్చు.

కొత్త హ్యుందాయ్ మైక్రో SUV కంపెనీ  అత్యంత బడ్జెట్ ఆఫర్ అవుతుంది. దీని ధరలు బేస్ వేరియంట్ రూ. 6 లక్షల నుండి ప్రారంభమవుతాయని ఇంకా రేంజ్-టాపింగ్ ట్రిమ్ రూ. 10 లక్షల వరకు పెరుగుతాయని భావిస్తున్నారు. నివేదికల ప్రకారం, ఈ మోడల్ 2023 పండుగ సీజన్‌లో మార్కెట్లోకి రానుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios