సుజుకికి షాక్: హార్లే డేవిడ్సన్ ఎండీగా సంజీవ్ రాజశేఖరన్
ఐకానిక్ అమెరికా మోటార్ బైక్ తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా సంజీవ్ రాజశేఖరన్ నియమితులయ్యారు. ఈ నెల 10 నుంచి ఆయన నియామకం అమలులోకి వచ్చిందని హార్లీ డేవిడ్సన్ సోమవారం ప్రకటించింది.
ఐకానిక్ అమెరికా మోటార్ బైక్ తయారీ సంస్థ హార్లీ డేవిడ్సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా సంజీవ్ రాజశేఖరన్ నియమితులయ్యారు. ఈ నెల 10 నుంచి ఆయన నియామకం అమలులోకి వచ్చిందని హార్లీ డేవిడ్సన్ సోమవారం ప్రకటించింది. సంజీవ్ రాజశేఖరన్ ఇంతకుముందు సుజుకి మోటార్ సైకిల్స్ సంస్థ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడిగా 2016 జూలైలో సేవలందిస్తూ వచ్చారు.
ఇక నుంచి గుర్గావ్ ప్రధానకేంద్రంగా గల హార్లీ డేవిడ్సన్ హెడ్ క్వార్టర్ నుంచి నుంచి ఆయన విధులు నిర్వహిస్తారు. హార్లీ డేవిడ్సన్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్‌గా రాజశేఖరన్.. సంస్థ ఇండియా టీంకు సారథ్యం వహిస్తారు. దేశీయంగా హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్ల విక్రయాలు, డీలర్ నెట్ వర్క్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్ యాక్టివిటీస్ విస్తరణలో కీలక భూమిక వహిస్తారని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇంతకుముందు మార్కెటింగ్, సేల్స్ అండ్ ఆపరేషన్స్ విభాగాల్లో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం గడించారు. సుజుకి ఇండియా మోటార్స్‌లో పని చేయడానికి ముందు పనాసోనిక్, ఎలక్ట్రోలక్స్, శ్యాంసంగ్ ఇండియా, థామ్సన్ ఇండియా, ఒనిడా, బ్లూ ప్లాస్ట్ తదితర కన్జూమర్ డ్యూరబుల్స్ సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేసిన అనుభవం గడించారు.
హార్లీ డేవిడ్సన్ జనరల్ మేనేజర్ నిగెల్ కియోగ్ మాట్లాడుతూ కస్టమర్ ఫోకస్డ్ పరిశ్రమల్లో ఏళ్ల తరబడి పని చేసిన ఆయన అనుభవం, నైపుణ్యం తదుపరి తరం హార్లీ డేవిడ్సన్ రైడర్లకు ఎంతో విలువైందన్నారు.
1903లో అమెరికాలో ఏర్పాటైన హార్లీ డేవిడ్సన్ 2009లో భారతదేశంలో అడుగు పెట్టింది. 2010లో తొలి డీలర్‌ను నియమించుకున్నది. ప్రస్తుతం స్పోర్ట్ స్టర్, డైనా, సాఫ్టయిల్, వీ-రోడ్, టూరింగ్, స్ట్రీట్ మోడల్ బైక్ లను విక్రయించింది.
దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు గుర్గావ్, చండీగఢ్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కొచి, కోల్ కతా, అహ్మదాబాద్, ఇండోర్, పుణె, గోవా, గువాహటి, జైపూర్‌ల్లో డీలర్ షిప్‌లు కలిగి ఉంది.
2011లో హర్యానాలోని బావల్‌లో అసెంబ్లీంగ్ యూనిట్ స్థాపించిన హార్లీ డేవిడ్సన్ సంస్థ.. స్పోర్ట్ స్టర్, 2012లో డైనా, 2013లో సాఫ్టయిల్ లైన్ మోడల్ బైక్‌ను మార్కెట్‌లోకి ఆవిష్కరించింది. అమెరికాలో తర్వాత విదేశాల్లో హార్లీ డేవిడ్సన్ సంస్థకు విదేశాల్లో కేవలం బావల్‌లో మాత్రమే ఉత్పత్తి యూనిట్ కలిగి ఉంది.