Asianet News TeluguAsianet News Telugu

వారెవ్వా అదిరిందయ్యా ని టెస్ట్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఏంటంటే...?

రాయల్ బుల్లెట్ 5577 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేసిన వీడియోలో  ఈ బంగారు బుల్లెట్ ఎలా ఉంటుందో చూడవచ్చు. పేరు గోల్డ్ బుల్లెట్ అయినప్పటికీ ఇది బంగారంతో తయారు చేయలేదు. గోల్డ్ పెయింట్ స్కీమ్ మాత్రమే ఇచ్చారు. 

Gold royal enfield video viral in social media know its story here-sak
Author
First Published Jul 4, 2023, 11:39 AM IST

సాధారణంగా చాల మంది స్పోర్ట్స్ బైక్స్ లేదా పాత బైక్స్ ని మోడిఫై చేసుకొని వాడుతుంటారు. మరికొందరు ఎంతో ఇష్టపడి కొనుకున్న బైక్స్ ని చాలా జాగ్రత్తగా చేసుకుంటుంటారు. ఇండియాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా  కొత్తగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే దశాబ్దాల చరిత్ర ఉన్న ఈ కంపెనీకి చెందిన బైక్‌లకి యూత్  నుంచి పెద్దల వరకు ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ బైక్‌ను ఇష్టపడే కొందరు దీనిని వారికీ కావలసిన విధంగా మోడిఫై చేయించుకుంటుంటారు. ఇందులో భాగంగా ఓ వ్యక్తి తన రాయల్ ఎన్‌ఫీల్డ్  బైక్‌ను గోల్డెన్ బుల్లెట్‌లా డిజైన్ చేశాడు. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం... 

రాయల్ బుల్లెట్ 5577 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ పోస్ట్ చేసిన వీడియోలో  ఈ బంగారు బుల్లెట్ ఎలా ఉంటుందో చూడవచ్చు. పేరు గోల్డ్ బుల్లెట్ అయినప్పటికీ ఇది బంగారంతో తయారు చేయలేదు. గోల్డ్ పెయింట్ స్కీమ్ మాత్రమే ఇచ్చారు. బైక్ కలర్ కూడా ఒకేలా ఉండడంతో అక్కడక్కడా గోల్డ్ కలర్ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఇది బుల్లెట్ 350సీసీ బైక్ కావడం గమనార్హం.

నిజానికి గోల్డ్ కలర్ స్కీమ్ పొందే వాహనాలు చాలా అరుదు. ఇక్కడ కనిపిస్తున్న గోల్డ్ కలర్ బుల్లెట్.. టర్న్ ఇండికేటర్ల పైభాగంలో, హెడ్‌ల్యాంప్ కవర్, నంబర్ ప్లేట్, ఫ్రంట్ ఫోర్క్ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది. అంతే కాకుండా ఫుట్‌రెస్ట్‌లు, క్లచ్, లివర్, ఓడోమీటర్ అన్నీ గోల్డెన్ షేడ్‌లో ఉంటాయి. ఈ బైక్ హ్యాండిల్‌బార్‌పై ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్న బొమ్మను చూడవచ్చు. ఇది కూడా బంగారు రంగులో ఉంటుంది.

గోల్డెన్ బుల్లెట్ రైడర్ కూడా బైక్‌కు సరిపోయేలా బంగారు ఉంగరాలు, బ్రాస్‌లెట్ ఇంకా వాచ్ ధరిస్తాడు. ఈ బైక్ సైలెన్సర్ కూడా బంగారు రంగులో ఉంటుంది. ఈ బైక్ కి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ బంగారు బైక్ గోల్డెన్ మ్యాన్ గా పేరుగాంచిన మహారాష్ట్రలోని పూణె సమీపంలోని పింప్రి-చించ్వాడ్ ప్రాంతానికి చెందిన 'సన్నీ వాఘురే' అనే వ్యక్తికి చెందినదని తెలుస్తోంది. గతంలో కేరళకు చెందిన బాబీ చెమ్మనూర్ అనే వ్యాపారవేత్త గోల్డ్ కలర్ రోల్స్ రాయిస్ కారును ట్యాక్సీగా వాడేవాడు.

Follow Us:
Download App:
  • android
  • ios