Asianet News TeluguAsianet News Telugu

Upcoming Cars:మారుతి నుండి లంబోర్ఘిని వరకు ఈ ఐదు కార్లను ఏప్రిల్‌లో లాంచ్ కావొచ్చు..

దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ ఏప్రిల్ నెలలో ఫ్రాంక్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. యువత ఇంకా టెక్నాలజీని ఎక్కువగా ఇష్టపడే కస్టమర్ల కోసం కంపెనీ ప్రత్యేకంగా ఈ SUVని రూపొందించింది. జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో సందర్భంగా దీనిని ప్రవేశపెట్టారు. 

From Maruti to Lamborghini, these five cars can be launched in April, know full details
Author
First Published Apr 5, 2023, 4:05 PM IST

చాలా మంది కొత్త కార్ కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. కొందరు బడ్జెట్ ధరకు లభించే కార్స్ కోసం చూస్తుంటే మరికొందరు బెస్ట్ ఫీచర్స్ ఉన్న కార్స్ కోసం చూస్తుంటారు. అయితే మీడియా నివేదికల ప్రకారం, ఏప్రిల్ నెలలో దాదాపు ఐదు కార్లు లాంచ్ కానున్నాయి. ఏప్రిల్ 2023లో ఏ కంపెనీకి చెందిన ఏ కారును భారత మార్కెట్‌లో ఎంట్రీకి ఇస్తుందో  తెలుసుకుందాం... 

మారుతీ ఫ్రాంక్స్
దేశంలోని అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ ఏప్రిల్ నెలలో ఫ్రాంక్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. యువత ఇంకా టెక్నాలజీని ఎక్కువగా ఇష్టపడే కస్టమర్ల కోసం కంపెనీ ప్రత్యేకంగా ఈ SUVని రూపొందించింది. జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో సందర్భంగా దీనిని ప్రవేశపెట్టారు. సమాచారం ప్రకారం, కంపెనీ ఇప్పటివరకు ఫ్రాంక్‌ కార్  కోసం సుమారు 16500 వేల బుకింగ్‌లను పొందింది.

ఎం‌జి కామెట్
బ్రిటిష్ కార్ కంపెనీ MG మోటార్స్  బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్ కామెట్ కూడా ఈ నెలలో లాంచ్ చేయవచ్చు. మీడియా నివేదికల ప్రకారం, ఈ కార్ టెస్టింగ్ సమయంలో భారతీయ రోడ్లపై చాలాసార్లు కనిపించింది. కంపెనీ దీనిని  ఆసియా దేశాలలో వులింగ్ ఎయిర్ పేరుతో విక్రయిస్తోంది, అయితే భారతదేశంలో దీనిని కామెట్ పేరుతో ప్రవేశపెట్టవచ్చు. ఈ టూ-డోర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ ధర కూడా దాదాపు పది లక్షల రూపాయలు ఉండవచ్చు.

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్
మీడియా నివేదికల ప్రకారం, ఫ్రెంచ్ కార్ కంపెనీ సిట్రోయెన్ కూడా ఈ నెలలో భారత మార్కెట్లో C3 ఎయిర్‌క్రాస్‌ను విడుదల చేయవచ్చు. దీనిని ఏప్రిల్ 27 న ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఇది కంపెనీ ప్రస్తుత హ్యాచ్‌బ్యాక్ C3 ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడుతుంది. ఇందులో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వవచ్చు.

Mercedes-Benz AMG GT63 SE 
మెర్సిడెస్ కూడా ఈ నెలలో శక్తివంతమైన కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. మీడియా నివేదికల ప్రకారం, AMG GT53 SE పర్ఫర్మెంస్ ని మెర్సిడెస్ ఏప్రిల్‌లో ప్రారంభించవచ్చు. ఈ  కారు కంపెనీ  మొదటి హైబ్రిడ్ AMG ఇంకా అత్యంత శక్తివంతమైన కార్ కూడా కావచ్చు. ఇందులో, ఫోర్-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్‌ను కంపెనీ ఇవ్వవచ్చు. దీనితో ఎలక్ట్రిక్ మోటారును కూడా అనుసంధానించవచ్చు.

లంబోర్ఘిని ఉరుస్ ఎస్
లాంబోర్గినీ ఉరుస్ ఎస్‌ని కూడా ఏప్రిల్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నివేదికల ప్రకారం, ఈ ఉరస్ కొత్త వెర్షన్‌గా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టబడుతుంది. ప్రస్తుతం దీనిని భారతదేశం కాకుండా ఇతర దేశాలలో అందించబడుతుంది. సమాచారం ప్రకారం, ఇందులో ఫోర్-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వబడుతుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios