Asianet News TeluguAsianet News Telugu

స్కూటర్ కొని గుడిలో పూజలు చేసిన విదేశీ యువతి.., వైరల్ వీడియో!

కొత్త స్కూటర్ డెలివరీ తీసుకున్న  యువతి నేరుగా గుడికి వెళ్లింది. తరువాత గుడి అర్చకులు వాహనానికి పూజలు చేశారు. కొబ్బరి కాయ  కొట్టి తీర్థం కూడా ఇచ్చాడు. ఈ విదేశీ యువతి పండ్లు, ఫులు సమర్పించి హారతితో పాటు పూజలు నిర్వహించారు. 
 

Foreign young woman who bought a scooter and worshiped in the temple, viral video!-sak
Author
First Published Jun 5, 2024, 1:11 PM IST

బండి కొన్న తర్వాత భారతీయులు పూజలు చేయడం సర్వసాధారణం. ఇప్పుడు ఓ విదేశీ యువతి స్కూటర్ కొని హిందూ సంప్రదాయం ప్రకారం ఆలయంలో పూజలు చేసింది. 

భారతదేశంలో ప్రకృతిని పూజిస్తారు. అంతేకాకుండా మానవ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించే అన్ని వస్తువులను పూజిస్తారు. వాహనాలు కొనుగోలు చేయడం, పూజలు చేయడం సర్వసాధారణం. భారతీయ సంప్రదాయానికి ఆధునికత తోడయినా పూజల్లో మాత్రం మార్పు రాలేదు. ఇటీవల విదేశీయులు భారతీయ సంప్రదాయం, సంస్కృతిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఓ విదేశీ యువతి కొత్త స్కూటర్ కొని ఆలయానికి వెళ్లి పూజలు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

కొత్త స్కూటర్ డెలివరీ తీసుకున్న  యువతి నేరుగా గుడికి వెళ్లింది. తరువాత గుడి అర్చకులు వాహనానికి పూజలు చేశారు. కొబ్బరి కాయ  కొట్టి తీర్థం కూడా ఇచ్చాడు. ఈ విదేశీ యువతి పండ్లు, ఫులు సమర్పించి హారతితో పాటు పూజలు నిర్వహించారు. 

Foreign young woman who bought a scooter and worshiped in the temple, viral video!-sak

ఈ విదేశీ యువతి పూజా కార్యక్రమం ముంబైలో జరిగినట్లు సమాచారం. ఈ స్కూటర్‌కు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్‌ నంబర్ ప్లేట్ ఉంది. ముంబైలో ఉద్యోగం చేస్తున్న ఓ విదేశీ యువతి తన రోజు ప్రయాణాలకి స్కూటర్ కొని పూజలు చేస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

విదేశీయులు భారతీయ సంప్రదాయాన్ని అనుసరించడం ఇదే మొదటిసారి కాదు. కానీ గత కొన్నేళ్లుగా భారతదేశం, భారతీయ సంప్రదాయాలు ఇంకా  ఆచారాలు ప్రపంచ గుర్తింపు పొందాయి. విదేశీయులు భారతీయ సంప్రదాయాలను పాటిస్తున్న పలు వీడియోలు వైరల్‌గా కూడా మారాయి. ఇప్పుడు ఈ యువతి వీడియో వైరల్‌గా మారింది. యువతి పూజ వీడియోపై కొన్ని కామెంట్లు కూడా  వ్యక్తమవుతున్నాయి. భారతీయ సంస్కృతిని మూఢనమ్మకమని కొందరు ఎగతాళి చేశారు. కొందరు పూజలపై విమర్శలు కూడా చేశారు. అయితే భారతదేశ పూజ పునస్కారానికి స్వదేశంలోను, విదేశాల్లోను ఎంతో గౌరవం లభిస్తుందనడం అబద్ధం కాదు.

బెంగళూరు, ముంబై సహా ప్రధాన నగరాల్లో మల్టి నేషనల్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆ విధంగా విదేశీయులు భారతదేశంలోని అనేక నగరాల్లో స్థిరపడ్డారు. చదువు కోసం వచ్చిన చాలా మంది విద్యార్థులు ఇతర ఉద్యోగాల కోసం భారతీయ నగరాల్లో స్థిరపడ్డారు. చాలా మంది భారతీయ సంస్కృతికి మారారు ఇంకా  ఇక్కడే స్థిరపడ్డారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios