కవాసకి నింజా ZX-4RR లిక్విడ్-కూల్డ్, 399cc, ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌తో  వస్తుంది, 14,500rpm వద్ద 77bhp శక్తిని ఇంకా  13,000rpm వద్ద 39Nm టార్క్‌ను   ఉత్పత్తి చేస్తుంది.

 ప్రముఖ కంపెనీ కవాసకి ఇండియాలో కొత్త ఫాస్టెస్ట్ ఇంకా అత్యంత ఖరీదైన బైక్‌ను లాంచ్ చేసింది. ఈ బైక్ పేరు నింజా ZX 4RR.

కవాసకి నింజా ZX-4RR లిక్విడ్-కూల్డ్, 399cc, ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌తో వస్తుంది, 14,500rpm వద్ద 77bhp శక్తిని ఇంకా 13,000rpm వద్ద 39Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 253 కి.మీ స్పీడ్ తో అత్యంత ఫాస్టెస్ట్ బైక్. ఈ నింజా ZX-4RR నింజా 4R లాగా ఉంటుందని చెప్పవచ్చు. 

కవాసకి మునపటి బైక్ నింజా 4ఆర్ లాగానే ఉన్నప్పటికీ, ఈ కొత్త బైక్‌లో ఎన్నో మార్పులు చేసింది. దీని గ్రీన్ కలర్ లుక్ దాని అందాన్ని పెంచుతుందని చెప్పవచ్చు. ఈ బైక్‌లోని ఎలక్ట్రానిక్స్ ప్యాకేజీ చిన్న కెపాసిటీ గల ZX మోడల్‌లాగ ఉంటుంది. బైక్‌లో ఫోర్ రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. 

స్పోర్ట్స్, ఆఫ్ రోడ్, రైన్ ఇంకా రైడర్ (కస్టమైజేబుల్). ఈ బైక్ ఈ నాలుగు మోడ్‌ల ద్వారా పవర్ పొందుతుంది. నింజా ZX 4RR ట్రాక్షన్ కంట్రోల్ ఇంకా ABS ఇంటర్వెన్షన్ సిస్టమ్‌లు ఈ 4 ప్రత్యేక మోడ్‌లకు అనుగుణంగా అడ్జస్ట్ చేయబడ్డాయి. 

భారత మార్కెట్‌లో రూ. 9.10 లక్షల నుండి, కొత్త కవాసకి ZX-4RR ధర ప్రస్తుతం ఉన్న Ninja ZX-4R కంటే రూ. 61,000 ఎక్కువ. రెండు బైక్‌లు CBUలుగా ఇండియాకి వస్తాయి, అందుకే ధర ఎక్కువ. నిజానికి, ZX-4RR ధర Z900 కంటే రూ. 28,000 తక్కువగా ఉండటం గమనించదగ్గ విషయం.