టెస్లా ఇండియా హెచ్‌ఆర్ హెడ్‌గా చిత్ర థామస్ నియామకం.. త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభం..
రిలయన్స్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ చిత్రా థామస్ తాజాగా టెస్లా ఇండియా హెచ్‌ఆర్ లీడర్ గా నియమితులయ్యారు. ఇంతకుముందు చిత్రా థామస్ వాల్ మార్ట్ లో కూడా పనిచేశారు.
అమెరికన్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా కంట్రి హెచ్‌ఆర్ లీడర్ గా చిత్ర థామస్‌ను నియమించింది. చిత్ర థామస్‌కు హెచ్‌ఆర్‌గా 18 సంవత్సరాల అనుభవం ఉంది.
రిలయన్స్ రిటైల్ లో ఆరు సంవత్సరాలు పనిచేసిన చిత్ర థామస్ తాజాగా టెస్లాలో చేరారు. అయితే దీనికిముందు రిలయన్స్ రిటైల్ ఇ-కామర్స్ ఇనిషియేటివ్ అజియో.కామ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ హెచ్ఆర్ హెడ్ గా కొనసాగారు.
రిలయన్స్ రిటైల్ ఇ-కామర్స్ అండ్ టెక్నాలజీ వ్యాపారాన్ని స్థాపించిన లీడర్ షిప్ పాత్రలో మొదటి ఉద్యోగి ఆమె అని లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో రాశారు. "ఆర్గానైజేషనల్ డిజైన్, టోటల్ రివార్డ్స్, టాలెంట్ అక్వైజేషన్, లెర్నింగ్ అండ్ అభివృద్ధి చేయడం, కోర్ హెచ్ ఆర్ ఆపరేషన్స్, సిస్టమ్స్ అండ్ క్యాపబిలిటీస్ లో భారతదేశంలోని 29 రాష్ట్రాలలో 25 వేల మంది ఉద్యోగులకు 90 మంది సభ్యుల బృందానికి నాయకత్వం వహించినట్లు" ఆమె రాశారు.
also read ఇండియాలోకి మరో కొత్త 125సిసి ఇటలీ బైక్.. లాంచ్ ముందే ఇంటర్నెట్ లో ధర, ఫీచర్స్ లీక్... ...
హెచ్‌ఆర్‌లో ఎంబీఏ పూర్తి చేసిన తరువాత చిత్ర థామస్ తన కెరీర్‌ను హెచ్‌పిఇ ఇండియాతో ప్రారంభించి వారితో ఆరేళ్లు పనిచేసింది. చెన్నైలోని లయోలా ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రాడ్యుయేట్ అయిన చిత్ర థామస్ ఇప్పుడు భారతదేశంలోని టెస్లా సీనియర్ లీడర్లలో ఒకరు.
2009లో ఆమె వాల్‌మార్ట్‌లో చేరింది, అయితే 2015లో రిలయన్స్ రిటైల్‌లో చేరడానికి ముందు వాల్‌మార్ట్‌లో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసింది.
జనవరి 2021లో భారతదేశంలో రిజిస్టర్ చేసుకున్న టెస్లా త్వరలో దేశంలో కార్యకలాపాలను ప్రారంభించనుంది. అలాగే కంపెనీ ఇతర పదవుల నియామకాన్ని కూడా వేగవంతం చేసింది. ఇటీవల ఇండియా రీజియన్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ గా మనుజ్ ఖురానాను సూపర్ ఛార్జింగ్, డేస్టీనేషన్ అండ్ హోమ్-ఛార్జింగ్ బిజినెస్ హెడ్ గా ఆర్థర్ ఎనర్జీకి చెందిన నిశాంత్‌ను నియమించింది.