Asianet News TeluguAsianet News Telugu

2019లో ఎన్నికైన మోస్ట్ బ్యూటీఫుల్ బైక్‌...ఏదో తెలుసా...

ఇటాలియన్ మ్యాగజైన్ పబ్లికేషన్ మోటోసిక్లిస్మో ఇటలీలోని మిలన్‌లో జరిగిన  EICMA 2019 మోటార్  ప్రదర్శనకు హాజరైన వారితో పదిహేనవ వార్షిక పోల్‌ను నిర్వహించింది. ఈ  మోటార్ ప్రదర్శనకు హాజరయిన వారు అలాగే ఆన్‌లైన్ ద్వారా కూడా కొందరు ఈ పోల్ లో పాల్గొన్నారు.

Ducati Streetfighter V4 Elected Most Beautiful Bike At EICMA 2019
Author
Hyderabad, First Published Nov 12, 2019, 5:21 PM IST

ఇటలీలోని మిలన్‌లో జరిగిన EICMA 2019 మోటార్‌సైకిల్ ప్రదర్శనలో డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 ను "మోస్ట్ బ్యూటిఫుల్ బైక్ ఆఫ్ ది షో" గా ఎంపిక చేశారు. EICMA సహకారంతో ఇటాలియన్ మ్యాగజైన్ మోటోసిక్లిస్మో నిర్వహించిన పోల్‌లో ఓటు వేసిన తరువాత ఈ తీర్పును వెల్లడించారు.

ఈ సంవత్సరం నిర్వహించిన పోల్ పదిహేనవ ఎడిషన్ కాగా ఇందులో డుకాటీ బైక్ సంస్థకి ఇది పదవ విజయం. 14,500 మందికి పైగా ఔత్సాహికులు డుకాటీ స్ట్రీట్ ఫైటర్ వి4 కు ఓటు వేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సందర్శకులు, మోటోసిక్లిస్మో వెబ్‌సైట్ యొక్క వినియోగదారులు అత్యధికంగా ఓటు వేసిన మోటారుసైకిల్ ఇది.

also read ఆఫ్ రోడ్ బైక్ రేసర్స్ కోసం ఇండియన్ ఎఫ్టీఆర్ 1200 ర్యాలీ...

సూపర్ నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ వి4 36.7 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలిచింది. EICMA 2019 ప్రదర్శన చివరి రోజు నవంబర్ 10 వరకు ఈ ఓట్ల బ్యాలెట్ జరిగింది.  

తరువాత EICMA యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మోటోసిక్లిస్మో ఫెడెరికో అలివర్టి యొక్క ఎడిటర్-ఇన్-చీఫ్ జియాకోమో కాసార్టెల్లి సమక్షంలో  ఈ అవార్డ్ ప్రదర్శన జరిగింది. అధికారిక కార్యక్రమం తరువాత డుకాటీ డిజైన్ సెంటర్ డైరెక్టర్ ఆండ్రియా ఫెరారేసి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.

Ducati Streetfighter V4 Elected Most Beautiful Bike At EICMA 2019


"తయారీదారులందరూ తమ ప్రధాన మోడళ్లతో పాల్గొనే ఈ పోటీలో ఈ అవార్డును అందుకోవడం మాకు చాలా గర్వంగా ఉంది, ప్రపంచంలోని అతి ముఖ్యమైన మోటారుసైకిల్ ఫెయిర్ అయిన EICMA, సాధారణ ప్రజలు స్ట్రీట్ ఫైటర్ V4 ను అత్యంత అందంమైన  బైక్ గా ఎన్నుకున్నారు" అని ఫెరారేసి చెప్పారు .

aslo read స్లైట్ జోష్! ప్యాసింజర్ వెహికల్స్ సేల్స్ దూకుడు

రెండవ స్థానం 14.9 శాతంతో స్ట్రీట్ ఫైటర్ వి4 యొక్క సగం కంటే తక్కువ ఓట్లను పొందిన అప్రిలియా ఆర్ఎస్ 660 కు దక్కింది. మూడవ స్థానంలో 11.23 శాతం ఓట్లతో ఎంవి అగుస్టా సూపర్‌వెలోస్ 800, నాలుగో స్థానంలో 9.43 శాతంతో కొత్త హోండా సిబిఆర్ 1000 ఆర్ఆర్-ఆర్ నిలిచింది. ఐదవ స్థానంలో మోటో గుజ్జీ వి85 టిటి ట్రావెల్ కేవలం 4.76 శాతం ఓట్లతో ఉంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios