డుకాటి నుండి మరో పవర్ ఫుల్ ఆఫ్-రోడర్ బైక్.. ధర, ఫీచర్స్ అదిరిపోయాయిగా..
ఎడారి, ఇరుకైన ఆఫ్-రోడ్ మార్గాలు, కంకర రోడ్లు అలాగే కొండ వంపులు వంటి ప్రదేశాలలో ఆఫ్-రోడింగ్ కోసం ఈ బైక్ రూపొందించబడింది. ఈ బైక్ డెలివరీలు జనవరి మొదటి వారంలో ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.
ఇటాలియన్ కంపెనీ డుకాటి భారత మార్కెట్లో ఆఫ్-రోడర్ బైక్ డెసర్ట్ ఎక్స్ ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త డుకాటి డెసర్ట్ ఎక్స్ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ.17,91,000గా నిర్ణయించింది. ఎడారి, ఇరుకైన ఆఫ్-రోడ్ మార్గాలు, కంకర రోడ్లు అలాగే కొండ వంపులు వంటి ప్రదేశాలలో ఆఫ్-రోడింగ్ కోసం ఈ బైక్ రూపొందించబడింది. ఢిల్లీ-NCR, ముంబై, పూణే, హైదరాబాద్, బెంగళూరు, కొచ్చి, కోల్‌కతా, చెన్నైలోని అన్ని డుకాటీ డీలర్‌షిప్‌లలో బైక్ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఈ బైక్ డెలివరీలు జనవరి మొదటి వారంలో ప్రారంభమవుతుందని కంపెనీ తెలిపింది.
ఇంజన్ అండ్ గేర్‌బాక్స్
డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డెస్‌మోడ్రోమిక్ డిస్ట్రిబ్యూషన్‌తో 937 సిసి డుకాటి టెస్టాస్ట్రాటా 11° ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను పొందింది. ఈ ఇంజన్ 9,250 rpm వద్ద 110 hp శక్తిని, 6,500 rpm వద్ద 92 Nm టార్క్‌ను అందిస్తుంది.
లుక్ అండ్ డిజైన్
లుక్ ఇంకా డిజైన్ గురించి చెప్పాలంటే, డుకాటి డెసర్ట్‌ఎక్స్ సెంట్రో స్టైల్ 80ల నాటి ఎండ్యూరో బైక్లకు డుకాటి తయారు చేసిన లేటెస్ట్ వెర్షన్‌లా కనిపిస్తుంది. ఈ బైక్ 21-అంగుళాల ఫ్రంట్ వీల్‌ను పొందుతుంది, ఈ వీల్ డెసర్ట్‌ఎక్స్‌కు బోల్డ్ అలాగే అడ్వెంచరస్ లుక్‌ని ఇస్తుంది.
ఒకవేళ ఒంటరిగా ప్రయాణిస్తున్నట్లయితే, అదనపు స్థలాన్ని సృష్టించడానికి బైక్‌కి ప్యాసెంజర్ సీటును తీసివేయడానికి ఆప్షన్ ఉంటుంది.
ఫీచర్లు
డుకాటి డెసర్ట్‌ఎక్స్ కి నిలువుగా ఉండే హై-రిజల్యూషన్ 5-అంగుళాల కలర్ TFT డిస్‌ప్లేను పొందుతుంది, ఇది నిలబడి-రైడ్ చేస్తున్నప్పుడు మంచి వ్యూ ఇస్తుంది. ఈ డిస్‌ప్లేను డుకాటీ మల్టీమీడియా సిస్టమ్‌తో అనుసంధానించవచ్చు, దీని ద్వారా రైడర్ స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేయవచ్చు. దీని నుండి మ్యూజిక్, కాల్ మేనేజ్‌మెంట్ ఇంకా టర్న్ బై టర్న్ నావిగేషన్ వంటి కొత్త ఫీచర్‌లను యాక్టివేట్ చేయవచ్చు.
అడ్వెంచర్ బైక్ సెగ్మెంట్‌లో డుకాటి డెసర్ట్ ఎక్స్ బిఎండబల్యూ ఆర్ 1250 GS, బిఎండబల్యూ R 1250 GS అడ్వెంచర్, ట్రయంఫ్ టైగర్ 900, హార్లే డేవిడ్‌సన్ పాన్ అమెరికా 1250 వంటి వాటితో పోటీపడుతుంది.