Tata Motors offers: టాటా మోటార్స్ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెల మాత్రమే ఛాన్స్..!
దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కార్ల విక్రయాలు పెంచుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటించింది. గత ఏడాది కొవిడ్ వల్ల ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగనందున.. వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.
స్వదేశీ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ (Tata Motors) భారతదేశంలోని టియాగో, టిగోర్, హారియర్, సఫారీ మోడళ్లతో సహా ఎంపిక చేసిన మోడళ్లపై అనేక రకాల ఆఫర్లను ప్రకటించింది. ఈ తగ్గింపులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ అండ్ లాయల్టీ డిస్కౌంట్ రూపంలో అందించనుంది. అయితే టాటా కంపెనీ టాటా నెక్సాన్ (Nexon), టియాగో(Tiago), హారియర్( Harrier), సఫారి (Safari) వంటి మోడళ్లపై ఈ తగ్గింపును అందిస్తోంది. గత ఏడాది కొవిడ్ వల్ల ఆశించిన స్థాయిలో విక్రయాలు జరగనందున వినియోగదారులను ఆకర్షించేందుకు భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. మోడళ్లను బట్టి రూ. 10 వేల నుంచి రూ.60 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఆఫర్లు ఈ నెలాఖరు వరకు ఉంటాయని సంస్థ పేర్కొంది.
సఫారీ 2021 వేరియంట్లపై అదిరే ఆఫర్
టాటా ఫ్లాగ్షిప్ ఎస్యూవీ అయిన సఫారీపై టాటా మోటార్స్ భారీ ప్రకటించింది. అయితే హారియర్ మాడల్లానే సఫారీ కూడా డీజిల్ వేరియంట్ మాత్రమే. అయితే ఇందులో ఆటో ట్రాన్స్మిషన్ లేదా మాన్యువల్ వేరింయట్ను ఎంచుకునే వీలుంది. ఇక ఆఫర్ విషయానికొస్తే.. రూ.60 వేల వరకు ఈ మోడల్‌పై డిస్కౌంట్ ప్రకటించింది టాటా మోటార్స్. 2021లో విక్రయం వాటికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఎక్ఛేంజ్ బెనిఫిట్స్ కలుపుకుని ఈ ఆఫర్ పొందొచ్చని తెలిపింది. ఇక 2022 వేరియంట్ కావాలంటే.. ఎక్స్ఛేంజ్, డిస్కౌంట్ కలిపి రూ.40,000 వరకు తగ్గింపు పొందొచ్చని తెలిపింది టాటా మోటార్స్.
టాటా హారియర్‌పై భారీ డిస్కౌంట్
టాటా పోర్ట్‌ఫోలియోలో మిడ్‌సైజ్ ఎస్యూవీ అయిన హారియర్ మోడల్‌పై కూడా రూ.60 వేల వరకు డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. ఈ ఆఫర్ కూడా 2021 స్టాక్ పైనే లభిస్తుందని సంస్థ తెలిపింది.
2022 వేరియంట్‌పై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుందని తెలిపింది టాటా మోటార్స్. డార్క్ ఎడిషన్ ట్రిమ్‌లు రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి. కార్పొరేట్ కొనుగోలుదారులు SUVపై రూ. 25,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
టియాగోపై రూ.30 వేలు తగ్గింపు
ఇటీవలే విడుదల చేసిన టియాగో సీఎన్జీ వేరియంట్‌పై రూ.10 వేల వరగు రివార్డ్‌తో పాటు.. రూ.20 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇక కార్పొరేట్ కొనుగోలుదారులకు రూ.5 వేలు డిస్కౌంట్ ఇవ్వనుంది.
టాటా టిగోర్ రూ.25 వేల వరకు తగ్గింపు
టాటా సెడాన్ విభాగంలోని టిగోర్‌పై కూడా టాటా మోటార్స్ భారీ డిస్కౌంట్ ఇస్తోంది. సీఎన్జీ వేరియంట్లకు మినహా ఇతర వేరియంట్లపై రూ.25 వేల వరకు ఈ డిస్కౌంట్ పొందొచ్చని పేర్కొంది.
నెక్సాన్‌పై ఆఫర్లు
టాటా కార్లలో ఎక్కువ మంది ఇష్టపడే మోడళ్లలో నెక్సాన్ కూడా ఒకటి ఈ మోడల్ ఇంజిన్, సహా ఇతర ఫీచర్లు వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఈ మోడల్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ.15 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది టాటా మోటార్స్. ఇక కార్పొరేట్ కొనుగోలుదారులకైతే రూ.10 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ఆల్ట్రోజ్‌పై ఆఫర్లు ఇవే..!
టాటా మోటార్స్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటైన ఆల్ట్రోజ్‌పై పరిమిత ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది కంపెనీ. కార్పొరేట్ కొనుగోలుదారులకు మాత్రమే ఈ మోడల్‌పై రూ.10 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది.