Asianet News TeluguAsianet News Telugu

హ్యుందాయ్ ఎన్ లైన్ కొత్త వేరియంట్ కార్.. స్పెషాలిటీ, ఫీచర్స్, ధర తెలుసా..?

మీడియా నివేదికల ప్రకారం, వెర్నా N లైన్ వేరియంట్‌ను హ్యుందాయ్ భారత మార్కెట్లోకి తీసుకురావచ్చు. N లైన్ వేరియంట్‌తో వస్తున్న కంపెనీ నుండి ఈ కార్ మూడవ కారు. 

Coming Hyundai's third N Line variant car, know what will be the specialty and price
Author
First Published Dec 9, 2022, 3:09 PM IST

దక్షిణ కొరియా కార్ కంపెనీ హ్యుందాయ్ త్వరలో ఎన్ లైన్ వేరియంట్‌తో కొత్త కారును భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కారులో ఎలాంటి ఫీచర్లు ఇవ్వవచ్చు, ఏ ధరకు లభించవచ్చు, లుక్ అండ్ డిజైన్ గురించి చూద్దాం....

హ్యుందాయ్  కొత్త వేరియంట్‌
మీడియా నివేదికల ప్రకారం, వెర్నా N లైన్ వేరియంట్‌ను హ్యుందాయ్ భారత మార్కెట్లోకి తీసుకురావచ్చు. N లైన్ వేరియంట్‌తో వస్తున్న కంపెనీ నుండి ఈ కార్ మూడవ కారు. ఇంతకుముందు, కంపెనీ ఐ-20 అండ్ వెన్యూ N-లైన్ వెర్షన్‌ను పరిచయం చేసింది.

ఫీచర్లు ఎలా ఉంటాయి
నివేదికల ప్రకారం, వెర్నా N లైన్ వేరియంట్‌లో ADAS, లేన్ డిపార్చర్ వార్నింగ్ సిస్టమ్, లేన్ కీప్ అసిస్ట్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అసిస్టెన్స్, ABS, EBD వంటి సేఫ్టీ ఫీచర్లను కంపెనీ అందించవచ్చు. దీనితో పాటు కారుకు కొత్త అల్లాయ్ వీల్స్, రెడ్ బ్రేక్ కాలిపర్స్, ఫ్రంట్ గ్రిల్‌పై బ్యాడ్జింగ్, రూఫ్ రైల్స్‌పై రెడ్ ఇన్సర్ట్ అండ్ ఫుల్ బ్లాక్ ఇంటీరియర్, సీట్లపై ఎన్ లైన్ బ్యాడ్జింగ్‌తో కూడిన రెడ్ కలర్ ఇన్‌సర్ట్ ఇవ్వవచ్చు.

ఇంజిన్ ఉంటుందంటే 
సమాచారం ప్రకారం, కారులో టర్బో పెట్రోల్ ఇంజన్ ఇవ్వవచ్చు. దీని సామర్థ్యం 1.5 లీటర్లు, ఈ కారు 120 PS అండ్ 172 న్యూటన్ టార్క్ ఉత్పత్తి  చేస్తుంది. ఈ ఇంజన్‌తో 7-స్పీడ్ DCT గేర్ ట్రాన్స్‌మిషన్ ఇవ్వవచ్చు.

ధర ఎంత ఉంటుందంటే 
ప్రస్తుతానికి, కారు ధర గురించి కంపెనీ అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ మీడియా నివేదికల ప్రకారం, కారు ధర సుమారు రూ. 15 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ప్రస్తుత వెర్నా ఎక్స్-షోరూమ్ ధర రూ.9.43 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 15.52 లక్షలు.

Follow Us:
Download App:
  • android
  • ios