Asianet News TeluguAsianet News Telugu

మారుతి నుండి హ్యుందాయ్ వరకు ఈ కార్లను మార్చిలో లాంచ్ చేయవచ్చు.. అవేంటో ఒకసారి లుక్కెయండి..

ఆటోమొబైల్  రంగంలో కొత్త కొత్త కార్లు లాంచ్ కు సిద్దమవుతున్నాయి. కొన్ని కంపెనీలు ఇప్పటికే లేటెస్ట్ ఫీచర్స్ తో ఇంకా ఫేస్ లిస్ట్ మోడల్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ADAS వంటి సేఫ్టీ ఫీచర్లను  కొన్ని  వేరియంట్లలో అందించవచ్చు. 

Cars of these companies from Maruti to Hyundai can be launched in March, know full details-sak
Author
First Published Mar 1, 2023, 1:52 PM IST

ఆటోమొబైల్ కంపెనీలు సేల్స్ పెంచడానికి ఇప్పటికే ఉన్న కార్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నాయి, కొన్ని కార్ల ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లను విడుదల చేయబడుతున్నాయి. అయితే అలాంటి ఐదు కార్ల గురించి సమాచారం మీకోసం, వీటిని మార్చి నెలలో విడుదల చేయవచ్చు...

హోండా సిటీ
మిడ్-సైజ్ సెడాన్ కార్ సిటీ  ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను జపనీస్ కార్ కంపెనీ హోండా మార్చి నెలలో భారత మార్కెట్లో విడుదల చేయవచ్చు. ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కు కంపెనీ ఎన్నో కొత్త ఫీచర్లను అందించవచ్చు. ADAS వంటి సేఫ్టీ ఫీచర్లను హోండా సిటీలోని అన్ని వేరియంట్లలో అందించవచ్చు. అంతేకాకుండా, దాని ఇంటీరియర్ ఇంకా ఎక్ట్సీరియర్‌లో కూడా తేలికపాటి మార్పులు చేయవచ్చు.

హ్యుందాయ్ వెర్నా
దక్షిణ కొరియా కార్ కంపెనీ హ్యుందాయ్ కూడా మార్చి నెలలో ప్రీమియం మిడ్-సైజ్ సెడాన్ కారు వెర్నా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కంపెనీ కొత్త వెర్నాను మార్చి 21న భారత మార్కెట్‌లో విడుదల చేయవచ్చు. ADAS వంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు, కొత్త వెర్నాలో కంపెనీ మరిన్ని ఫీచర్లను కూడా అందించవచ్చు. దీనితో పాటు, ఈ సెడాన్ కారు ప్రస్తుత వెర్షన్ కంటే  లుక్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది.  

టయోటా ఇన్నోవా క్రిస్టా
ఇన్నోవా క్రిస్టా 2023ని జపనీస్ కార్ కంపెనీ టయోటా త్వరలో భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. నివేదికల ప్రకారం, కంపెనీ దీనిని మార్చి నెలలోనే ప్రారంభించవచ్చు. ఎమ్‌పివి సెగ్మెంట్‌లో వచ్చిన ఇన్నోవా క్రిస్టాను కంపెనీ గత సంవత్సరం నిలిపివేసింది. అయితే ఇప్పుడు కొత్త సంవత్సరంలో మరోసారి దీని కోసం బుకింగ్‌లు తీసుకుంటున్నారు. క్రిస్టా ఇంతకుముందు కంటే మెరుగ్గా వచ్చే నెలలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

మారుతీ జిమ్నీ
ఆటో ఎక్స్‌పో 2023లో పరిచయం చేయబడిన మారుతి  SUV జిమ్నీ కూడా మార్చి నెలలో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మీడియా నివేదికల ప్రకారం, దీనిని మార్చిలో  ప్రారంభించబడుతుంది. జనవరి 12న జరిగిన ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఈ ఎస్‌యూవీని పరిచయం చేసింది. అప్పటి నుంచి దీని బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. బుకింగ్ ప్రారంభమైనప్పటి నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

మారుతీ ఫ్రాంక్స్
ఆటో ఎక్స్‌పో 2023 సందర్భంగా మారుతి పరిచయం చేసిన ఫ్రాంక్స్ SUV కూడా త్వరలో విడుదల కానుంది. మీడియా నివేదికల ప్రకారం, కంపెనీ దీనిని మార్చి నెలలో  ప్రారంభించవచ్చు. జిమ్నీ అండ్ ఫ్రాంక్‌ల బుకింగ్‌ను మారుతి 12 జనవరి 2023 నుండి ప్రారంభించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios