Car Care Tips: వర్షాకాలంలో వర్షం, వడగళ్ళ నుండి మీ కారుకు కాపాడుకుందుకు ఈ 5 టిప్స్ తెలుసుకోండి..

వర్షం, వడగళ్ళ నుండి మీ కారును రక్షించడానికి బెస్ట్ మార్గం దానిని షెడ్ పార్కింగ్‌లో ఉంచడం. ఇది కారును సురక్షితంగా ఉంచుతుంది. గాలి వాన, తుపాను సమయంలో కూడా ఎలాంటి హాని ఉండదు. 

Car Care Tips: Storms  and rains in monsoon will not be able to harm the car, know 5 tricks here-sak

వేసవి కాలం ముగుస్తున్నది, మరికొద్దిరోజుల తరువాత వర్షాకాలం మొదలవుతుంది. ఈ వర్షాకాలంలో  కూడా ఈదురు గాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితిలో మీరు ఎంతో ఖర్చు పెట్టి కొన్న కారును జాగ్రత్తగా చూసుకోవడం కూడా అవసరం. వర్షంలో కారు సురక్షితంగా ఉండాలంటే 5 చిట్కాలు తెలుసుకొండి...

 కార్ పార్కింగ్
వర్షం, వడగళ్ళ నుండి మీ కారును రక్షించడానికి బెస్ట్ మార్గం దానిని షెడ్ పార్కింగ్‌లో ఉంచడం. ఇది కారును సురక్షితంగా ఉంచుతుంది. గాలి వాన, తుపాను సమయంలో కూడా ఎలాంటి హాని ఉండదు. మీరు కారుపై  దుమ్ము, ధూళి  లేకుండా  కూడా రక్షించవచ్చు.

రబ్బరు మ్యాట్ 
వర్షాకాలంలో వర్షం, వడగళ్ళు, తుఫాను కారణంగా కారు అద్దాలు లేదా విండ్‌షీల్డ్‌లకు పగుళ్లు ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితిలో కవర్   పార్కింగ్   సౌకర్యం లేనట్లయితే, మీరు విండో గ్లాస్ పై రబ్బరు మ్యాట్లను ఉంచవచ్చు అలాగే వాటిని సురక్షితంగా ఉంచవచ్చు. అయితే, అవి కొంత వరకు మాత్రమే రక్షణను అందించగలవు.

వర్షం పడుతుంటే ఇంకా కారును సురక్షితంగా ఉంచడానికి మీకు సమయం ఉంటే, వెంటనే కారుని కవర్ తో కప్పండి. దీని కారణంగా, వర్షం, వడగళ్ళు లేదా తుఫానుకి  ప్రభావితం కాకుండా  కారు సురక్షితంగా ఉంటుంది.

సైడ్ మిర్రర్
ప్రస్తుతం వస్తున్న కార్లలోని సైడ్ మిర్రర్‌లలో కొన్ని సెన్సార్లు ఉంటున్నాయి. అందుకే ఈ అద్దాలు చాలా కాస్ట్లీ. వడగళ్ళు, వర్షం లేదా తుఫాను నుండి సైడ్ మిర్రర్ ని పాడవకుండా  ఉంచడాయికి మీరు వాటిని పూర్తిగా మడవండి, అలాగే  సురక్షితంగా ఉంటాయి.

కారు కవర్
వర్షాకాలంలో వడగళ్ళు కారుకు ఎక్కువగా  నష్టం కలిగిస్తాయి. మార్కెట్లో వివిధ రకాల కార్ కవర్లు అందుబాటులో ఉన్నాయి. వీటితో మీరు కారును రక్షించుకోవచ్చు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios