ఓలా క్యాబ్స్ బై..బై.. ఏప్రిల్ నెలలో షట్ డౌన్.. కస్టమర్లకు మెసేజ్..

విదేశీ మార్కెట్లలో సేవలను నిలిపివేయడానికి ఓలా క్యాబ్స్ రెండు ప్రధాన కారణాలను తెలిపింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో భారీ అవకాశలను సృష్టించింది. రైడ్ హెయిలింగ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం కూడా ఎక్కువగా  మారుతోంది. 

by end of April Ola service End in these regions..  what led to company's big decision?-sak

న్యూఢిల్లీ : ప్రముఖ భారతీయ క్యాబ్ అగ్రిగేటర్ కంపెనీ ఓలా క్యాబ్స్ ఈ నెల చివరితో  విదేశాల్లో సేవలను ముగించనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. ఇండియాలో సర్వీసెస్  ప్రారంభించిన తర్వాత భారీ విజయాన్ని సాధించిన ఓలా క్యాబ్స్, ఆ తర్వాత ఆస్ట్రేలియా, న్యూజిలాండ్,  యునైటెడ్ కింగ్‌డమ్‌లకు సేవలను అందించడం ప్రారంభించింది. ఓలా కంపెనీ ఇప్పటికే కస్టమర్లకు  ఈ విషయంలో నోటిఫికేషన్‌లను పంపడం ప్రారంభించింది. ఏప్రిల్ 12 నుంచి ఆస్ట్రేలియాలో ఓలా క్యాబ్స్   సేవలను నిలిపివేయనుంది. భారత్‌లో  క్యాబ్ సర్వీసెస్  మెరుగుపరుచుకోవడంతోపాటు రాబోయే ఐపీఓకు సిద్ధమయ్యే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

విదేశీ మార్కెట్లలో సేవలను నిలిపివేయడానికి ఓలా క్యాబ్స్ రెండు ప్రధాన కారణాలను తెలిపింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో భారీ అవకాశలను సృష్టించింది. రైడ్ హెయిలింగ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం కూడా ఎక్కువగా  మారుతోంది. కాబట్టి కంపెనీ   సోర్సెస్ లో ఎక్కువ భాగం భారతదేశంలోనే కేటాయించాలని యోచిస్తోంది.

ఓలా క్యాబ్స్ విదేశాల్లో సర్వీసెస్  ప్రారంభించినప్పటికీ, కంపెనీకి భారత్ అతిపెద్ద మార్కెట్. అయితే బెంగళూరులోని అమెరికా దిగ్గజం ఉబర్, మేరు, నమ్మ యాత్రి సహా పలు యాప్‌లు పోటీని ఇస్తున్నాయి. మరిన్ని క్యాబ్ అగ్రిగేటర్ల కోసం ఒక ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడానికి భారతీయ మార్కెట్‌కు కూడా అవకాశం ఉంది. TaxiForsure, Mary అండ్ రష్యా ఆధారిత InDrive వంటి చిన్న క్యాబ్ అగ్రిగేటర్లు మార్కెట్ ఆధిపత్యాన్ని పొందుతున్నాయి. కాబట్టి ఓలా క్యాబ్స్ భారత్‌లో తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. నేడు నాలుగు చక్రాల వాహనాలకే పరిమితమైన సేవలలో ఆటో-రిక్షాలు ఇంకా ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి. 

తాజాగా లాభదాయకంగా మారిన కంపెనీ 2022-23లో మొత్తం రూ.2,135 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సమయంలో  దాని  నష్టాలను కూడా తగ్గించుకుంది. మరోవైపు, ఓలా   మాతృ సంస్థ ANI టెక్నాలజీస్ ఇతర రంగాల్లోకి కూడా  ప్రవేశించింది, అదే  ఎలక్ట్రిక్ స్కూటర్ వ్యాపారం.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios