Asianet News TeluguAsianet News Telugu

కస్టమర్లకు బంపర్ ఆఫర్, కేవలం 64 వేలకే బైక్.. ఈ ఫీచర్స్ భలే ఉన్నాయే..

ఖరీదైన ప్రపంచంలో ఏ బైక్ చూసిన లక్ష రూపాయలకు పైనే ఉంటుంది. ఇప్పుడు హోండా కస్టమర్లకు గొప్ప ఆఫర్ ఇచ్చింది. హోండా సరికొత్త షైన్ బైక్‌ను కేవలం రూ.64,900కే విడుదల చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Bumper offer for customers, launch of Honda shine bike for only 64 thousand rupees-sak
Author
First Published Mar 16, 2023, 6:06 PM IST | Last Updated Mar 16, 2023, 6:06 PM IST

వాహన తయారీ సంస్థ  హోండా ఇండియాలో ద్విచక్ర వాహన రంగంలో సరికొత్త రికార్డును లిఖించింది. హోండా తాజాగా సరికొత్త షైన్ బైక్‌ను విడుదల చేసింది. కొత్త లుక్, కొత్త డిజైన్, కొత్త ఇంజన్‌తో హోండా షైన్ బైక్ లాంచ్ అయింది. ఈసారి బడ్జెట్ ధర, అత్యధిక మైలేజీని అందించగల బైక్‌ను విడుదల చేసింది. సరికొత్త హోండా షైన్ 100 బైక్ సంచలనం సృష్టించింది. దీనికి కారణం 100 సీసీ ఇంజన్ కలిగిన కొత్త హోండా షైన్ బైక్ ధర రూ.64,900 మాత్రమే (ఎక్స్-షోరూమ్). హోండా షైన్ 100 కొత్త బైక్ 5 కలర్స్ లో అందుబాటులో ఉంది.

కొత్త హోండా షైన్ బైక్‌లో 100సీసీ OBD2 కంప్లైంట్ PGM-F1 ఇంజన్ అందించారు. బైక్ పర్ఫర్మెంస్ ఎనాన్స్ స్మార్ట్ పవర్ (ESP) సపోర్ట్ తో మెరుగుపర్చారు. ఇది ఎకో-ఫ్రెండ్లీ ఇంజిన్. కొత్త 100సీసీ ఇంజన్ తేలికైనది ఇంకా సమర్థవంతమైనది. 

ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (PGM-FI): 
ఆప్టిమమ్ ఫ్యూయెల్ అండ్ ఎయిర్ మీక్షర్ స్థిరంగా అందించడానికి ఆన్‌బోర్డ్ సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. ఇది స్థిరమైన పవర్ జనరేషన్, అధిక ఇంధన సామర్థ్యం, తక్కువ ఉద్గారాలకు సహాయపడుతుంది.

ఆటోమేటిక్ చౌక్ సిస్టమ్‌గా పనిచేసే సోలేనోయిడ్ వాల్వ్ రిచ్ వాటర్ ఫ్యుయెల్ మిశ్రమాన్ని నిర్ధారిస్తుంది ఇంకా ఎప్పుడైనా సింగిల్ స్టార్ట్  సౌలభ్యాన్ని అందిస్తుంది.

దూర ప్రయాణం కోసం రైడర్ అండ్ పిలియన్ రైడర్ కోసం తగినంత స్థలాన్ని అందిస్తుంది. ఫ్యామిలీ లేదా యుటిలిటీ-ఆధారిత రైడ్‌లు కావచ్చు, షైన్ 100 సీటింగ్ పొజిషన్ సాటిలేని సౌకర్యాన్ని అందిస్తుంది ఇంకా అలసట లేని ప్రతిరోజూ ప్రయాణానికి ఈ బైక్ గొప్ప ఆప్షన్. ఈ షైన్ 100కి ప్రత్యేకంగా రూపొందించిన ట్యాంక్ ఇంకా రైడర్‌కు అద్భుతమైన మోకాలి సపోర్ట్ అందించే న్యారో లెగ్ ఓపెనింగ్ యాంగిల్‌ ఉంది.

హోండా షైన్ 100 భారీ లోడ్లతో కూడా గుంతలను సాఫీగా అధిరోహించడంలో సహాయపడుతుంది. పొడవైన వీల్‌బేస్ (1245 ఎం‌ఎం) అధిక గ్రౌండ్ క్లియరెన్స్ (168 ఎం‌ఎం) హై స్పీడ్ తో క్లిష్టమైన రోడ్ పరిస్థితులలో కూడా స్థిరత్వాన్ని అందిస్తాయి.

HMSI షైన్ 100పై ప్రత్యేకమైన 6-సంవత్సరాల వారంటీ ప్యాకేజీని (3 సంవత్సరాల స్టాండర్డ్ + 3 సంవత్సరాల ఆప్షనల్ ఎక్స్టెండెడ్ వారంటీ) కూడా అందిస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios