మహీంద్రా కార్లపై బంపర్ తగ్గింపు.. ఈ రెండు హాట్ సెల్లింగ్ ఎస్‌యూవిలపై ఎలాంటి తగ్గింపు ఉందంటే..?
మహీంద్రా లైనప్‌లోని అత్యంత ఖరీదైన ఎస్‌యూవిపై ఈ నెలలో అతిపెద్ద తగ్గింపు(huge discounts)ను అందిస్తోంది. ఫిబ్రవరి నెలలో Alturas G4 SUV కొనుగోలుపై రూ. 81,500 వరకు ప్రయోజనాలు అందిస్తుంది. Alturas G4 భారతీయ మార్కెట్లలో టయోటా ఫార్చ్యూనర్, ఎంజి గ్లోస్టర్‌తో పోటీపడుతుంది.
దేశంలోని ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (mahindra&mahindra) ఫిబ్రవరిలో వాహనకొనుగోలుదారులకు భారీ తగ్గింపును అందిస్తోంది. ఈ నెలలో ఎంపిక చేసిన మోడళ్లపై కార్ల తయారీ సంస్థ రూ. 81,500 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ఎక్స్‌యూవి700, థార్, బోలెరో నియో ఎస్‌యూవి వంటి ఫ్లాగ్‌షిప్ మోడల్‌లు ఎటువంటి లేవు. ఎక్స్‌యూవి 700, మహీంద్ర థార్ కస్టమర్ల నుండి గొప్ప స్పందనను పొందాయి అలాగే వాటి డెలివరీ కోసం చాలా నెలలు వేచి ఉండాల్సి వస్తుంది.
తాజాగా విడుదల చేసిన బొలెరో నియోకు కూడా మంచి స్పందన లభించడంతో దానిపై కూడా ఎలాంటి తగ్గింపును అందించడం లేదు. ఫిబ్రవరి నెలలో మహీంద్రా ఎస్‌యూవిని కొనుగోలు చేయడం ద్వారా మీరు ఎంత ఆదా చేయవచ్చో చూద్దాం...
మహీంద్రా లైనప్‌లోని అత్యంత ఖరీదైన ఎస్‌యూవిపై ఈ నెలలో అతిపెద్ద తగ్గింపును అందిస్తోంది. ఫిబ్రవరి నెలలో Alturas G4 SUV కొనుగోలుపై రూ. 81,500 వరకు ప్రయోజనాలు అందిస్తుంది. Alturas G4 భారతీయ మార్కెట్లలో టయోటా ఫార్చ్యూనర్, ఎంజి గ్లోస్టర్‌తో పోటీపడుతుంది.
మహీంద్రా ఆల్టురాస్ G4 పై రూ.50,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందిస్తుండగా కార్పొరేట్ డిస్కౌంట్లు, ఇతర ఆఫర్లతో సహా రూ. 31,500 వరకు అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. మహీంద్రా భారతదేశంలో Alturas G4 SUVని రెండు ట్రిమ్‌లలో అందిస్తోంది. 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ Alturas G4 2WD అండ్ 4WD ఆప్షన్స్ లో వస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 28.85 లక్షల నుండి మొదలై రూ. 31.85 లక్షల వరకు ఉంటుంది.
మహీంద్రా సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవి మహీంద్రా XUV300 ఇతర కార్లలో రెండవ అతిపెద్ద బెనెఫిట్స్ అందిస్తుంది. మహీంద్రా ఈ SUVపై రూ. 69,000 వరకు ప్రయోజనాలను ఇస్తుండగా రాబోయే రోజుల్లో, కంపెనీ ఈ SUV ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావచ్చు. మహీంద్రా XUV300పై రూ. 30,000 నగదు తగ్గింపుతో పాటు ఎన్నో ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తోంది. XUV300పై కూడా రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4,000 కార్పొరేట్ తగ్గింపు, రూ. 10,000 విలువైన ఇతర ప్రయోజనాలతో అందించబడుతోంది.
మహీంద్రా భారతదేశంలో XUV300 SUVని 16 వేరియంట్లలో అందిస్తోంది. దీని 1.2-లీటర్ పెట్రోల్ W4 వేరియంట్ ధర రూ. 8.16 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది అలాగే టాప్-స్పెక్ వేరియంట్ 1.5-లీటర్ డీజిల్ ఆటోమేటిక్ డబ్ల్యూ8 ట్రిమ్ కోసం రూ. 13.67 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
మహీంద్రా అత్యంత బడ్జెట్ ఎస్‌యూవి KUV100 NXT పై కూడా రూ. 60,000 కంటే ఎక్కువ విలువైన బెనెఫిట్స్ పొందవచ్చు. కంపెనీ ఈ SUVకి ఇతర ప్రయోజనాలతో పాటు రూ. 38,000 క్యాష్ తగ్గింపును కూడా అందిస్తోంది. మొత్తంమీద ఈ SUVపై రూ. 61,000 విలువైన బెనెఫిట్స్ అందించబడుతున్నాయి. ఈ మూడు ఎస్‌యూవీలు కాకుండా మహీంద్రా ఈ నెలలో స్కార్పియో (స్కోర్పియో)పై రూ. 34,000 వరకు, బొలెరో ఎస్‌యూవీపై రూ. 24,000 వరకు విలువైన బెనెఫిట్స్ అందిస్తోంది.